నువ్వులు, బెల్లం కలిపిన లడ్డూలు ఈ రోగాలకి దివ్య ఔషధం.. ఎలాగంటే..?

Sesame Jaggery Ladoo: చలికాలంలో నువ్వులు, బెల్లం కలిపిన లడ్డూలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Update: 2022-02-23 14:00 GMT

నువ్వులు, బెల్లం కలిపిన లడ్డూలు ఈ రోగాలకి దివ్య ఔషధం.. ఎలాగంటే..?

Sesame Jaggery Ladoo: చలికాలంలో నువ్వులు, బెల్లం కలిపిన లడ్డూలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే సహజంగానే నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇంకా బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో రక్తహీనత సమస్యని అధిగమించవచ్చు. అంతేకాదు సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, గొంతునొప్పిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తాయి. ఖర్చు కూడా చాలా తక్కువ. అంతేకాదు షుగర్ పేషెంట్లకు స్వీట్ తినాలనిపిస్తే వీటిని ట్రై చేయవచ్చు. వీటిని ఇంట్లోనే సులభంగా తయారుచేయవచ్చు. ఏ విధంగా అనేది తెలుసుకుందాం.

నువ్వుల లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు..

250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల నువ్వులు, రెండు చెంచాల బాదం, రెండు చెంచాల జీడిపప్పు, రెండు చెంచాల నెయ్యి 4 నుంచి 5 యాలకులు అవసరం.

ఎలా తయారు చేయాలి..?

ముందుగా నువ్వులను కడిగి ఆరబెట్టాలి. తర్వాత బాణలిలో మీడియం మంట మీద వేయించాలి. నువ్వులు కాల్చేటప్పుడు పగిలిన శబ్దం వస్తుంది. నువ్వులను నిరంతరం కదిలిస్తూ లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత వాటిని చల్లార్చాలి. అందులో నుంచి సగం నువ్వులను మిక్సీలో వేసి రుబ్బాలి. తర్వాత బయట ఉంచిన నువ్వులు దానికి యాడ్ చేయాలి. ఇప్పుడు పాన్లో ఒక చెంచా నెయ్యి వేసి అందులో బెల్లం వేసి కరిగించుకోవాలి. బెల్లం కరిగిన వెంటనే అందులో జీడిపప్పు, బాదం పప్పులను చిన్న ముక్కలుగా కోసి వేయాలి. యాలకుల పొడి కూడా వేయాలి.

తరువాత ఈ మిశ్రమంలో నువ్వులను వేసి అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని నిమ్మకాయ సైజులో లడ్డూలు చేయాలి. తర్వాత వీటని కొద్దిసేపు ఆరనివ్వాలి. అంతే నువ్వులు, బెల్లం లడ్డులు రెడీ. వీటిని గాలి చొరబడని కంటైనర్లో పెట్టి నిల్వచేసుకుంటే చాలాకాలం తాజాగా ఉంటాయి.

Tags:    

Similar News