Samantha Silent Retreat: సమంత పాటిస్తోన్న సైలెంట్ రిట్రీట్.. ఇదే ఆమె అందానికి, ఆనందానికి కారణమా?
Samantha Silent Retreat: ఈ మధ్య కాలంలో అందాల తార సమంత రూల్ ప్రభుని ఎక్కడ చూసినా థిన్ బాడీ లుక్‌తో కనిపిస్తుంది. అంతేకాదు.. ఎప్పుడూ నవ్వుతూ, జోకులు వేసుకుంటూ కనిపిస్తుంది.
Samantha Silent Retreat: సమంత పాటిస్తోన్న సైలెంట్ రిట్రీట్.. ఇదే ఆమె అందానికి, ఆనందానికి కారణమా?
Samantha Silent Retreat: ఈ మధ్య కాలంలో అందాల తార సమంత రూల్ ప్రభుని ఎక్కడ చూసినా థిన్ బాడీ లుక్‌తో కనిపిస్తుంది. అంతేకాదు.. ఎప్పుడూ నవ్వుతూ, జోకులు వేసుకుంటూ కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఒక వైపు పర్సనల్ లైఫ్ డిస్ట్రబెన్సెస్ మరో వైపు మయోసైటిస్ వ్యాధి.. ఈ రెండింటితో కొన్నాళ్లపాటు సమంత సతమతమైంది. కానీ.. ఈ మధ్య తను ఎప్పుడు ఏం చేస్తుందనే విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అందులో తాజాగా తను సైలెంట్ రీట్రీట్‌లో ఉన్నానని, మూడు రోజుల పాటు అన్నింటికీ దూరంగా ఉంటానని తెలిపింది. ఇంతకీ అసలు ఈ సైలెంట్ రీట్రీట్ ఏంటి? దానివల్ల ఉపయోగాలేంటి? తెలుసుకుందాం..
ఇటీవల సమంత రూతు ప్రభు తన సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ వస్తోంది. తాజా తను మూడు రోజుల పాటు నిశబ్ధంగా, ఫోన్ లేకుండా కమ్యూనికేషన్స్ లేకుండా గడిపానని తెలిపింది. దీని పేరు సైలెంట్ రీట్రీట్ అని కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు అందరూ ఈ సైలెంట్ రీట్రీట్ ఏంటనే నెట్‌లో ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు.
ఎవరికి వారు ఒంటరిగా ఉండటం అనేది భయానకమైన విషయం. అనుభిస్తానే గానీ దాని బాధ ఏంటో తెలియదు. అయితే ఇలా మూడు రోజుల పాటు ఎవరితో సంబంధాలు లేకుండా, దగ్గర ఫోన్ లేకుండా అసలు ఎటువంటి కమ్యూనికేషన్స్ లేకుండా మూడు రోజులు సమంత గడిపింది. దీన్నీ సైలెంట్ రీట్రీట్ అంటారు. అంటే నిశబ్ధంగా ఎవరికి వారే తన శరీరాన్ని హీల్ చేసుకోవచ్చన్నమాట.
ఈ సైలెంట్ రీట్రీట్ గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత సమంతకు చాలా మెసేజెస్‌లు వచ్చాయి. అందులో ఒక మెసేజ్ ఏంటంటే.. మీరు మళ్లీ ఇది ఫాలో అవుతారా? సైలెంట్ రీట్రీట్ చేస్తారా? అని ఉంది. దానికి సమాధానంగా సమంత ఒకటి కాదు రెండు కాదు లక్షల సార్లు ఈ రీట్రీట్ చేస్తాను సమాధానం ఇచ్చింది. ఇంతకీ అసలు ఈ సైలెంట్ రీట్రీట్‌లో ఏముంది?
సమంత చెప్పిన దాని ప్రకారం.. ఈ సైలెంట్ రీట్రీట్‌లో మూడు రోజుల పాటు ఉండటం తన జీవితాన్నే మార్చిందని చెబుతోంది. తనకు తోడు తానే. మనం మనతోనే ఒంటరిగా గడపడం, ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. దీనివల్ల నేను ఎంతో లాభం పొందాను అని సమంత చెప్పింది.
సైలెంట్ రిట్రీట్ అంటే ఏంటి?
సైలెంట్ రీట్రీట్ అనేది ఒక రకమైన బ్రేక్. ఇక్కడ వ్యక్తులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోరు. ఒంటరి జీవితం గడుపుతారు. అంతేకాదు అంతర్గత విషయాలపై దృష్టి పెడతారు. యోగా, ధ్యానం, నడక.. ఇలా అన్నీ ఒంటరిగానే జరుగుతాయి. అయితే మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండొచ్చు.
లాభాలేంటి?
మనస్సుకి ప్రశాంతత
మనసులో ఉండే అలజడలు తగ్గుతాయి. నిశబ్ధం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఇలా ఉండటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. దీంతో పాటు మనసు ఆనందంగా ఉంటే శరీరం అందంగా మారుతుంది.
నిశద్ధం
సైలెంట్ రిట్రీట్‌లో నిశబ్ధంగా ఉండాలి. నిశబ్దం ఎప్పుడూ మంచిదే. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడ కుండా ఉండటం ఇంకా మంచిది. దీంతో ఎటువంటి భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉండదు. దీనివల్ల చేయాల్సిన పనులపై స్పష్టత వస్తోంది.
ఒంటరితనం
ఒంటరిగా ఉన్నప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అదే మూడు రోజుల పాటు ఒంటరిగా ఉంటే.. జీవితంపై ఒక క్లారిటీ వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగతాం.
ఆశ్రమాలు
పూనెలోని ఓషో నిసర్గ 21 రోజుల సైలెంట్ రీట్రీట్‌ను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా విపశన ధ్యాన కేంద్రం, అమృత పురి ఆశ్రమాల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు.