Beauty Tips: వంటగదిలో ఉండే 4 వస్తువులతో ముఖంపై ఉన్న మచ్చలు తొలగించుకోండి..!

Beauty Tips: ఇంతకు ముందు ముఖంపై మచ్చలు వృద్ధాప్యానికి సంకేతం అని నమ్మేవారు...

Update: 2022-04-30 07:12 GMT

Beauty Tips: వంటగదిలో ఉండే 4 వస్తువులతో ముఖంపై ఉన్న మచ్చలు తొలగించుకోండి..!

Beauty Tips: ఇంతకు ముందు ముఖంపై మచ్చలు వృద్ధాప్యానికి సంకేతం అని నమ్మేవారు. కానీ ఇప్పుడు చాలా మంది ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే ముఖంపై మచ్చలు రావడంతో బయటికి రాలేక ఇబ్బందిపడుతున్నారు. చెడ్డ జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఇలాంటి మచ్చలు ఏర్పడుతాయి. అంతే కాకుండా కాలుష్యంతో పాటు హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తోంది. ముఖంపై ఉండే మచ్చల వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ నాలుగు టిప్స్‌ పాటించి సరిచేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

1. నిమ్మకాయ

ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ రసం తీసి అందులో తేనె కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మచ్చలు తగ్గే వరకు దీన్ని అప్లై చేస్తూనే ఉండాలి. మీరు దీన్ని రోజుకు రెండుసార్లు అప్లై చేసుకోవచ్చు. నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. తేనె మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ రెండూ కలిసి మచ్చలని తొలగిస్తాయి.

2. ముడి బంగాళాదుంప

ముడి బంగాళాదుంపను సగానికి కట్ చేయండి. కత్తిరించిన భాగంలో కొన్ని నీటి చుక్కలు వేసి దానిని ముఖంపై గుండ్రంగా రుద్దండి.10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోండి. నెల రోజుల పాటు రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేయాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. ముఖం కోమలంగా తయారవుతుంది.

3. ఉల్లిపాయలు

ముందుగా ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. మచ్చలున్న ప్రాంతంలో ఉల్లిపాయ ముక్కతో రుద్దాలి. ముఖంపై 15 నిమిషాల పాటు రుద్దిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఉల్లిపాయ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ముఖం స్పష్టంగా కనిపించే వరకు ఈ రెమెడీని ప్రయత్నిస్తూ ఉండండి. దీన్ని రోజుకు రెండుసార్లు అప్లై చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉల్లిపాయలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

4. అలోవెరా జెల్

ముందుగా కలబంద గుజ్జును తీసి అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ముఖాన్నిసరిగ్గా శుభ్రం చేసి ముఖానికి పట్టించాలి. ఇలా చేసిన తర్వాత ముఖంపై గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కొద్ది రోజుల్లోనే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

Tags:    

Similar News