Realme P3x 5G: రియల్‌మి నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్.. ఫిబ్రవరి 18న లాంచ్

Realme P3x 5G: రియల్‌మి తన అభిమానులకు ఓ తీపి వార్త అందించింది. రియల్‌మి P3 ప్రో 5G ఫోన్‌ను ఫిబ్రవరి 18న దేశంలో లాంచ్ చేయనున్నట్లు ఇటీవల కంపెనీ తెలిపింది.

Update: 2025-02-14 14:00 GMT

Realme P3x 5G: రియల్‌మి నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్.. ఫిబ్రవరి 18న లాంచ్

Realme P3x 5G: రియల్‌మి తన అభిమానులకు ఓ తీపి వార్త అందించింది. రియల్‌మి P3 ప్రో 5G ఫోన్‌ను ఫిబ్రవరి 18న దేశంలో లాంచ్ చేయనున్నట్లు ఇటీవల కంపెనీ తెలిపింది. ఇప్పుడు, కంపెనీ రియల్‌మి P3 ప్రో 5జీతో పాటు మరో మొబైల్ లాంచ్‌ను ప్రకటించింది. అదే రోజున బడ్జెట్ సెగ్మెంట్‌లో 'Realme P3x 5G' ఫోన్‌ను కూడా విడుదల చేయనుంది. ఈ కొత్త ఫోన్ ధర, ఫీచర్స్ తెలుసుకుందాం.

రియల్‌మి ఫిబ్రవరి 18న లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఈ ఈవెంట్‌లో Realme P3x 5G, Realme P3 Pro 5G ఫోన్‌లను భారత మార్కెట్‌లో విడుదల కానున్నాయి. ఈవెంట్‌ను కంపెనీ వెబ్‌సైట్, అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది.

రియల్‌మి P3x 5G మొబైల్ ఐస్‌ఫీల్డ్ డిజైన్‌తో వస్తుంది. ఫోన్‌ను లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, స్టెల్లార్ పింక్ కలర్స్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో 8GB RAM ఉంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ రియల్‌మి P3x 5G లైట్‌ వెయిట్, స్లిమ్ స్మార్ట్‌ఫోన్. ఫోన్ మందం 7.94 మిమీ మాత్రమే.

ఈ మొబైల్‌ 6.78-అంగుళాల ఆమ్లోడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్‌లో గేమింగ్ కోసం 6050mm VC కూలింగ్ సిస్టమ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 12GB RAM తో లాంచ్ అవుతుంది. టాప్ వేరియంట్‌లో 512GB స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మొబైల్ 5500mAh కెపాసిటీ బ్యాటరీతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది.

Tags:    

Similar News