వర్షాకాలం వచ్చేసింది.. మీ ఇంట్లో తీసుకోవాల్సిన ఐదు జాగ్రత్తలు ఇవే..!
వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదాలు జరగొచ్చు. ముఖ్యంగా ఇళ్లలో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నప్పుడు మరింత కేర్ తీసుకోవాలి.
వర్షాకాలం వచ్చేసింది.. మీ ఇంట్లో తీసుకోవాల్సిన ఐదు జాగ్రత్తలు ఇవే..!
వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదాలు జరగొచ్చు. ముఖ్యంగా ఇళ్లలో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నప్పుడు మరింత కేర్ తీసుకోవాలి. ముఖ్యగా ఈ ఐదు జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చు.
వర్షాకాలంలో ఆరోగ్యం, పరిసరాలు, కరెంట్, ఆహారం, ఇల్లు.. ఇలాంటి వాటిపైన ఎక్కువ శ్రద్ద పెట్టాలి. అయితే వేసవికాలంలో లేదా చలికాలంలో తేమ ఎక్కువగా ఉండటం, దానివల్ల వైరస్, బ్యాక్టీరియాలు పెరిగిపోవడం వంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఎండ వాటినన్నింటనీ నాశనం చేస్తుంది. కానీ వర్షాకాలంలో ఎండ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో వైరస్, బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. అంతేకాదు తడి ఎక్కువగా ఉండటం వల్ల చాలా రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. వీటినన్నింటికీ దూరంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవడం తప్పనసరి.
పరిశుభ్రమైన వంటగది
ఈ కాలంలో వంటగదిని ఎప్పుడు చూసినా తడిగానే ఉంటుంది. అంతేకాదు ఒకరకమైన చెడు వాసన కూడా వస్తూ ఉంటుంది. అయితే వంటగది పరిశుభ్రంగా ఉంటే చెడు వాసనకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా కూరగాయలు కట్ చేసిన తర్వాత ఆ చెత్తను వంటగదిలో నిల్వ ఉంచకూడదు. బాల్కనీ లేదా ఇంటి బయట సెపరేట్ కవర్లలలో ఈ చెత్త వేయాలి. అదేవిధంగా సింక్‌లోని గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. అలాగే అక్కడ నిల్వ ఉండే నీళ్లతో బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు పొడి బట్టతో వంటగదిని శుభ్రం చేసుకోవాలి.
దుప్పట్లు మార్చాలిందే
వర్షాకాలంలో దుప్పట్టు ఉతికితే తొందరగా ఆరవు. అయితే పలచని, సిల్క్ దుప్పట్లు ఈ సీజన్‌లో వాడాలి. ఎందుకంటే పిల్లలు, పెద్దవాళ్లు తరచూ మంచాలపైనే ఉంటారు. దీనివల్ల మంచంపై ఉన్న బెడ్ షీట్లు తొందరగా మాసిపోతాయి. అందుకే వారానికి రెండు సార్లైనా వీటిని మార్చాలి. అప్పుడు బ్యాక్టీరియా, వైరస్‌లు మీ ఇంట్లో ఉండే పిల్లలకు పెద్దవాళ్లకు రాకుండా నిలిపివేయగలుగుతాం.
బట్టలను శుభ్రంగా..
ఈ కాలంలో ఎక్కడబడితే అక్కడ ఇళ్లలో బట్టలు కనిపిస్తాయి. ఉతకాల్సిన బట్టలు, ఉతికిన తర్వాత ఆరుతున్న బట్టలు, బీరువాల్లో బట్టలు.. ఇలా ఎక్కడబడితే అక్కడ చిందరవందరంగా బట్టలు కనిపిస్తుంటాయి. అయితే.. ఈ బట్టలను దేనికవి సెపరేట్ చేసి ఒక బాక్సులో పెట్టడం మంచిది. లేదంటే పిల్లలు ఆరిన బట్టలు, ఉతకని బట్టలను కలిపేయొచ్చు. కాబట్టి బట్టలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
స్విచ్ బోర్డులకు దూరంగా..
వర్షాకాలంలో కరెంట్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్లకు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. తడి చేతులతో స్విచ్ బోర్డులను ముడుతుంటారు. దీనివల్ల షాక్ తగిలి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ కాలంలో వీటి నుంచి జర భ్రద్రంగా ఉండాలి. అలా కుదరకపోతే ఈ కాలంలో స్విచ్ బోర్డులపై ఒక ట్రాన్స్ పరెంట్ కవర్‌ను అతికించాలి. దీని ద్వారా కొంతైన ఫ్రాణాలను కాపాడుకోవచ్చు.
వేడి ఆహారమే మంచిది
ఈ కాలంలో వేడి ఆహారమే మంచిది. ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలు, పెద్దవాళ్లు ఇంట్లో ఎవరున్నా సరే వారు ఖచ్చితంగా వేడి ఆహారమే తినాలి. అలా కాకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఆహారాన్ని తినకూడదు. ఇంటిలోపల వేడి వేడిగా తినడం వల్ల ఈ కాలంలో వచ్చే అంటు వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.