Pressure Cooker: ఈ ఆహారాలు కుక్కర్‌లో వండితే ఆరోగ్యానికి ప్రమాదం..!
Pressure Cooker: కుక్కర్‌లో వంట చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? కొన్ని ఆహార పదార్థాలను వండేటప్పుడు దాని నుండి నురుగు బయటకు వస్తుంది. అది శరీరాన్ని చేరి జీర్ణవ్యవస్థను పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Pressure Cooker: ఈ ఆహారాలు కుక్కర్‌లో వండితే ఆరోగ్యానికి ప్రమాదం..!
Pressure Cooker: కుక్కర్‌లో వంట చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? కొన్ని ఆహార పదార్థాలను వండేటప్పుడు దాని నుండి నురుగు బయటకు వస్తుంది. అది శరీరాన్ని చేరి జీర్ణవ్యవస్థను పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కుక్కర్‌లో కొన్ని ఆహార పదార్ధాలను వండటం ఆరోగ్యానికి హానికరం అని అంటున్నారు. వీటిని ప్రెషర్ కుక్కర్‌లో వండటం వల్ల రుచి చెడిపోవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రమాదమని, పోషకాలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. కాబట్టి, పొరపాటున కూడా కుక్కర్‌లో ఈ ఆహార పదార్థాలను ఉడికించకండి.
ఈ 5 వస్తువులను ప్రెజర్ కుక్కర్‌లో ఎప్పుడూ ఉడికించకండి.
పాలు
పాలు, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను ప్రెజర్ కుక్కర్‌లో అస్సలు వండకూడదు. ఇలా చేయడం వల్ల దాని రుచి చెడిపోతుంది. పోషకాలు కూడా తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
వేయించిన పదార్థాలు
వేయించిన పదార్థాలు, పకోడీలు వంటి ఆహార పదార్థాలను కుక్కర్‌లో వండకూడదు. ఇలా చేయడం ద్వారా అంత రుచిగా ఉండవు. ఎందుకంటే వీటిని కుక్కర్‌లో డీప్ ఫ్రై చేయలేరు. అందుకే వీటిని ఎప్పుడూ పాన్ లోనే చేయాలి.
నూడుల్స్
నూడుల్స్ ఉడికిన తర్వాత మెత్తగా అవుతాయి కాబట్టి వాటిని ఎప్పుడూ ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించకూడదు. ఎందుకంటే అవి ఎక్కువగా ఉడికితే దాని టేస్ట్ పోతుంది. అందువల్ల, వాటిని ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించడం మానుకోవాలి.
ఆకుకూరలు
పాలకూర వంటి ఆకుకూరలను కుక్కర్‌లో ఎప్పుడూ ఉడికించకూడదు. ఎందుకంటే ఆకుకూరల్లో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కానీ ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల దానిలోని ముఖ్యమైన పోషకాలు తగ్గిపోతాయి. ఇది ఆరోగ్యానికి దారి తీయవచ్చు.
కేక్
తరచుగా ప్రజలు ఓవెన్ లేకపోతే ప్రెషర్ కుక్కర్‌లో కేక్‌ను తయారుచేస్తారు. కానీ ఇలా తయారు చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ అనేది వంట కోసం తయారు చేయబడింది, బేకింగ్ కోసం కాదు. కాబట్టి, అందులో కేక్ ఎప్పుడూ చేయకండి.