Pregnancy Tips: ప్రెగ్నెన్సీ టైంలో రక్తం పెరగాలంటే ఈ ఆహారాలు తినండి
Pregnancy Tips: చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో రక్తం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇలా టెన్షన్ పడడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బుందులు వస్తాయి.
Pregnancy Tips: ప్రెగ్నెన్సీ టైంలో రక్తం పెరగాలంటే ఈ ఆహారాలు తినండి
Pregnancy Tips: చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో రక్తం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇలా టెన్షన్ పడడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బుందులు వస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారపదార్ధాలను తినడం వల్ల శరీరంలో రక్తం స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇపుడు చూద్దాం.
అప్పటివరకు రక్తం స్థాయిలు బాగానే ఉంటాయి. ప్రెగ్నెన్సీ రాగానే రక్తం నెమ్మదిగా తగ్గిపోతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోతారు. ఏం చేయాలో తెలియక డాక్టర్ల దగ్గరకు వెళతారు. నిజంగా ఆ సమయంలో డాక్టర్‌ని సంప్రదించడమే చాలా మంచిది. అయితే కొన్ని ఆహారపదార్ధాలను కూడా తీసుకోవడం రక్తం స్థాయిలు పెరుగుతాయి.
ఎర్రని జామకాయ
జామకాయల లోపల ఎర్ర రంగు లేదా తెల్ల రంగులు ఉంటాయి. అయితే ఇలా ఎర్రని లేదా లేత గులాబీ రంగులో ఉండే జామకాయలు తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తీసుకోవడం వల్ల కడుపులో ఉండే బేబీకి కూడా చాలా మంచిది.
బీట్ రూట్
బీట్ రూట్ ఫ్రై లేదా జ్యూస్ తాగడం వల్ల కూడా శరీరంలో రక్తం పెరుగుతుంది. బీట్ రూట్‌లో సొరకాయ, క్యారెట్, కీరా కలిపి మిక్స్ చేసుకుని, వడకట్టి తాగినా కూడా రక్తం స్థాయిలు పెరుగుతాయి.
దానిమ్మ
రోజుకు ఒక కప్పు దానిమ్మ గింజలు తింటే వారం రోజుల్లో రక్తంలో మార్పులు గమనించవచ్చు. రక్తం స్థాయిలను పెంచడంలో దానిమ్మ ప్రధాన పాత్రను పోషిస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో దానిమ్మను ఎక్కువగా తినండి.
డ్రై ఫ్రూట్స్
చాలమందికి ఈ సయమంలో డ్రై ఫ్రూట్స్‌ని నేరుగా తినబుద్ది వేయదు. కాబట్టి, వీటిని లడ్డూ రూపంలో చేసుకుని తింటే మంచిది. అంటే డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కాస్త నెయ్యి వేసి వేంచాలి. ఆ తర్వాత వాటిని పొడిచేసి, ఆ పొడిలో కాస్త బెల్లం పొడి, కాస్త నెయ్యి వేసి లడ్డూలుగా చుట్టాలి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల రక్తం స్థాయిలు పెరగడమే కాకుండా ఉత్సాహంగా ఉంటారు.
అయితే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. శరీరాన్ని బట్టి ఆహారపదార్దాలను తినాలి. ఒకవేళ మీకు పడని ఆహారపదార్ధాలను కచ్చితంగా మీరు తినకూడదు. మీ డాక్టర్‌ని సంప్రదించి ఏ ఆహారం తినడం మంచిదో తెలుసుకుని తినాలి.