పీరియడ్స్ నొప్పి ఇబ్బంది పెడుతుందా? తగ్గించుకోవడానికి ఈ సహజ చిట్కాలు పాటించండి
పీరియడ్స్ సమయంలో అనేక మంది మహిళలు తీవ్ర నొప్పి, అసౌకర్యంతో బాధపడుతుంటారు. సాధారణంగా గర్భాశయంలో జరిగే సంకోచాల వల్ల ఈ నొప్పి వస్తుంది.
పీరియడ్స్ నొప్పి ఇబ్బంది పెడుతుందా? తగ్గించుకోవడానికి ఈ సహజ చిట్కాలు పాటించండి
పీరియడ్స్ సమయంలో అనేక మంది మహిళలు తీవ్ర నొప్పి, అసౌకర్యంతో బాధపడుతుంటారు. సాధారణంగా గర్భాశయంలో జరిగే సంకోచాల వల్ల ఈ నొప్పి వస్తుంది. గర్భాశయం లోపలి పొర (ఎండోమెట్రియం) కదలికల కారణంగా రుతుస్రావం సమయంలో రక్తం బయటకు రావడానికి సహాయం జరుగుతుంది.
పీరియడ్స్ నొప్పి ఎందుకు వస్తుంది?
ఈ సంకోచాలు ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాల వల్ల ఏర్పడతాయి. హార్మోన్ అసమతుల్యత, ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ స్థాయిల్లో మార్పులు కూడా నొప్పికి కారణం కావచ్చు. అదనంగా నిద్రలేమి, ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్లు, గర్భాశయ సంబంధిత సమస్యలు కూడా పీరియడ్స్ నొప్పిని పెంచుతాయి.
నొప్పి తగ్గించడానికి సహజ మార్గాలు
కడుపు లేదా నడుముపై హీట్ ప్యాక్ పెట్టడం
వేడినీటి బాటిల్‌తో మసాజ్ చేయడం
వెచ్చని నీళ్లతో స్నానం చేయడం
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తినడం
అల్లం టీ లేదా దాల్చిన చెక్క టీ తాగడం
కొబ్బరి నూనె లేదా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌తో మృదువుగా మసాజ్ చేయడం
ఈ చిట్కాలు మందుల అవసరం లేకుండా పీరియడ్స్ నొప్పిని సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి.