Palm oil: వంటల్లో వాడే పామాయిల్ ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది?

ఈ మధ్య చాలామంది పామాయిల్‌ను వంటల్లో ఎక్కువగా వాడుతున్నారు. అది రుచికోసమే లేక బరువు తగ్గించుకోవడం కోసమో కానీ.. ఈమధ్య కాలంలో పామా ఆయిల్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. అసలింతకీ పామాయిల్ ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2025-07-12 13:30 GMT
Palm oil: వంటల్లో వాడే పామాయిల్ ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది?

Palm oil: వంటల్లో వాడే పామాయిల్ ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది?

  • whatsapp icon

ఈ మధ్య చాలామంది పామాయిల్‌ను వంటల్లో ఎక్కువగా వాడుతున్నారు. అది రుచికోసమే లేక బరువు తగ్గించుకోవడం కోసమో కానీ.. ఈమధ్య కాలంలో పామా ఆయిల్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. అసలింతకీ పామాయిల్ ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

పామాయిల్.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడే ఆయిల్ ఈ పామాయిల్. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని అంతగా ఉపయోగించరు. అసలు కొంతమందికి దీని వల్ల ఉపయోగం ఉందా? లేదా అన్న విషయం కూడా తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు రెగ్యులర్‌‌గా తినే బిస్కట్లు, చిప్స్, చాక్లెట్లు, ఐస్ క్రీములలో ఈ పామాయిల్‌నే ఎక్కువగా వాడతారు. దీనికి ప్రత్యేకమైన రుచి ఉండదు. అందుకే బ్యాకరీల్లో దీని వాడకం ఎక్కువైపోయింది. కానీ దీన్ని వాడకూడదని కొంతమంది నిపుణులు చెబుతుంటారు. అసలింతకీ పామాయిల్ వాడొచ్చా. వాడకూడదా? చూద్దాం.

సాధారణంగా పామాయిల్‌లో మూడు రకాల ఫ్యాట్స్ ఉంటాయి. అవి శాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్. వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్ వంటి ప్రమాదకరమై జబ్బులు వస్తాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ప్రకారం, పామాయిల్‌లో దాదాపు 40 గ్రాముల శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సన్ ఫ్లవర్, ఆవ నూనెల్లో అయితే అది 20 గ్రాములు మాత్రమే ఉంటుంది. అందుకే పామాయిల్ కంటే ఈ నూనెలు వాడితే మంచిదని నిపుణులు చెబుతారు..

అయితే.. సాధారణంగా కొన్ని నూనెల తయారు చేసేటప్పుడు హైడ్రోజనేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ తయారవుతాయి. ఇవి శరీరంలోకి వెళితే గుండె జబ్బులు, క్యాన్సర్లు, చివరకు ప్రెగ్నెన్సీ సమయంలో కూడా సమస్యలు వస్తాయి. అయితే పామాయిల్‌లో ఇలాంటి ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే సహజంగా సెమి సాలిడ్‌లోనే ఉంటుంది కాబట్టి. సో.. ఇందులో ఎటువంటి ప్రమాదకరమైన ఫ్యాట్స్ ఉండవు.

పామాయిల్‌లో టోకో ట్రినాల్స్ అనే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే మోతాదుకంటే ఎక్కువగా ఈ నూనె వాడకూడదు. అదేవిధంగా మళ్లీ మళ్లీ మరిగించి ఈ నూనె వాడకూడదు.

Tags:    

Similar News