Oxytocin: 'లవ్ హార్మోన్'తో మహిళల్లో మూడ్ స్వింగ్స్ తగ్గవచ్చట!
మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా వచ్చే మానసిక ఆందోళనలు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను ఆక్సిటోసిన్ అనే హార్మోన్ నియంత్రించగలదని తాజా పరిశోధన వెలుగులోకి తీసుకువచ్చింది.
Oxytocin: 'లవ్ హార్మోన్'తో మహిళల్లో మూడ్ స్వింగ్స్ తగ్గవచ్చట!
మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా వచ్చే మానసిక ఆందోళనలు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను ఆక్సిటోసిన్ అనే హార్మోన్ నియంత్రించగలదని తాజా పరిశోధన వెలుగులోకి తీసుకువచ్చింది. బ్రిగ్హమ్ అండ్ విమెన్స్ హాస్పిటల్ మరియు హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ఈ ‘లవ్ హార్మోన్’ మహిళల మానసిక ఆరోగ్యాన్ని రక్షించే శక్తి కలిగి ఉంది.
ప్రాసవానంతరం, మెనోపాజ్ సమయంలో మూడ్ మార్పులు
ప్రసవానంతరం మరియు మెనోపాజ్ వంటి హార్మోనల్ దశల్లో, నిద్రలేమి మహిళల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే, ఆక్సిటోసిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్న మహిళలు ఈ ఒత్తిడిని తక్కువగా అనుభవిస్తున్నారని పరిశోధనలో తేలింది.
అధ్యయన విశేషాలు
38 ఆరోగ్యవంతమైన ప్రీమెనోపాజల్ మహిళలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో, హార్మోనల్ మార్పులు మరియు నిద్ర ఆటంకాల మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. మూడు రాత్రుల పాటు నిద్రకు ఆటంకం కలిగించిన తర్వాత మహిళల్లో మానసిక ఆందోళనలు మరియు ఆక్సిటోసిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. అయితే, నిద్ర ఆటంకానికి ముందు ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉన్నవారిలో ఆందోళన తక్కువగా కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఆక్సిటోసిన్ – సహజ మానసిక రక్షణ కవచం
"నిద్ర ఆటంకాల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడంలో ఆక్సిటోసిన్ సహాయపడుతోంది," అని బ్రిగ్హమ్ హాస్పిటల్ అసోసియేట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఐరీన్ గోన్సాల్వెజ్ తెలిపారు. యాంటీడిప్రెసెంట్లు లేదా హార్మోన్ థెరపీ కాకుండా సహజమైన మార్గాల్లో మానసిక ఆరోగ్యాన్ని నిలుపుకోవడంలో ఇది ఓ కొత్త దారిగా కనిపిస్తోంది.
ఈ అధ్యయనం ‘ENDO 2025’ ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశంలో ప్రదర్శించబడింది. నిద్రలేమి, హార్మోనల్ మార్పులు కారణంగా మహిళలు ఎదుర్కొనే మానసిక సమస్యలపై ఆక్సిటోసిన్ ఆధారిత చికిత్సలు భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలవొచ్చని నిపుణులు భావిస్తున్నారు.