Strong Bones: బలమైన ఎముకల కోసం కాల్షియం ఒక్కటే కాదు ఇది కూడా అవసరమే..!

Strong Bones: ఎముకలు బలంగా ఉండాలంటే ప్రతిరోజు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, సోయాబీన్, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, సాల్మన్ చేపలు, నారింజ, అత్తి పండ్లను తీసుకోవాలి.

Update: 2024-03-18 16:00 GMT

Strong Bones: బలమైన ఎముకల కోసం కాల్షియం ఒక్కటే కాదు ఇది కూడా అవసరమే..!

Strong Bones: ఎముకలు బలంగా ఉండాలంటే ప్రతిరోజు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, సోయాబీన్, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, సాల్మన్ చేపలు, నారింజ, అత్తి పండ్లను తీసుకోవాలి. అలాగే ఎముకల బలానికి విటమిన్ డి కూడా చాలా అవసరం. ఇది సాధారణంగా సూర్యకిరణాల ద్వారా లభించే పోషకం కాబట్టి కొంత ఉదయం ఎండలో గడపాలి. విటమిన్ డి ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా ఎముకల సాంద్రతను పెంచుతుంది. విటమిన్ డి రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. శరీరంలో జీవక్రియను పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం నుంచి రక్షిస్తుంది.

విటమిన్ డి రిచ్ ఫుడ్స్

1. గుడ్డు పచ్చసొన

2. పెరుగు

3. ఓట్ మీల్

4. పుట్టగొడుగులు

5. పాలు

6. సోయా ఉత్పత్తులు

7. బచ్చలికూర

8. చేప

ప్రోటీన్ ముఖ్యమైనది

ప్రోటీన్ సాయంతో ఎముకలు కండరాలు బలపడతాయి. ఇందుకోసం తప్పనిసరిగా గుడ్డులోని తెల్లసొన, పప్పులు, బీన్స్, మాంసం, పౌల్ట్రీ, సోయాబీన్, పాలు తీసుకోవాలి. భారీ పని చేసే వ్యక్తులకు ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రొటీన్‌ లోపిస్తే వ్యాధులను ఆహ్వానించినట్లే అవుతుంది. ప్రతిరోజు డైట్‌లో ప్రొటీన్‌ ఫుడ్స్‌ ఉండే విధంగా చూసుకోవాలి.

Tags:    

Similar News