Coronavirus: కరోనా కొత్త వేరియంట్.. వస్తే నరకం చూడాల్సిందే.
New Coronavirus variant Nimbus: కోవిడ్-19కు మరో కొత్త వేరియంట్ వచ్చిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని NB.1.8.1గా గుర్తించారు, కానీ సాధారణంగా "నింబస్" వేరియంట్ అని పిలుస్తున్నారు.
Coronavirus: కరోనా కొత్త వేరియంట్.. వస్తే నరకం చూడాల్సిందే.
New Coronavirus variant Nimbus: కోవిడ్-19కు మరో కొత్త వేరియంట్ వచ్చిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని NB.1.8.1గా గుర్తించారు, కానీ సాధారణంగా "నింబస్" వేరియంట్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త వేరియంట్‌ను మొదటగా 2025 జనవరిలో చైనాలో గుర్తించారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు 22 దేశాల్లో ఇది వ్యాపించిందని నివేదికలు తెలిపాయి.
భారతదేశంలో పెరుగుతోన్న కేసులు
నింబస్ వేరియంట్ కారణంగా భారత్‌లో రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్, గతంలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన సబ్-లైనేజ్ నుంచి వచ్చింది. ఇందులో స్పైక్ ప్రోటీన్ మార్పులు ఉన్నట్లు తెలిసింది, ఇవి వేగంగా వ్యాప్తికి కారణమవుతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.
విభిన్నమైన లక్షణాలు
ఈ వేరియంట్‌కు సంబంధించి కనిపిస్తున్న లక్షణాలలో "రేజర్ బ్లేడ్ గొంతు" అనే ప్రత్యేక లక్షణం ఉంది. ఇది తీవ్రమైన గొంతునొప్పిగా ఉంటుందని, రోగులు చెబుతున్నారు. "గాజు ముక్కలు మింగినట్లు" అనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో పాటు జ్వరం, దగ్గు, అలసట, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరికి వికారం, అతిసారం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తున్నాయి.
మళ్లీ అలర్ట్ కావాల్సిన సమయం
ఈ వేరియంట్‌కి ఉన్న మ్యూటేషన్‌ల వల్ల, ఇది మన శరీర రోగనిరోధక వ్యవస్థను తప్పించుకొని వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా గాలి లేని, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి శాతం అధికంగా ఉంటుంది. వర్షాకాలం మొదలవుతుండటంతో వాతావరణం వైరస్ ప్రబలడానికి దోహదపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో వేగంగా పెరుగుతోన్న కేసులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,000కి పైగా కోవిడ్ కేసులు ఉన్నాయి. కేవలం కేరళలోనే 2,200కి పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం లోపలే కేసులు 6.9 శాతం పెరిగాయి. జనవరి నుండి ఇప్పటివరకు 100 మందికి పైగా మరణాలు సంభవించాయి. వీరిలో ఎక్కువగా వృద్ధులు, డయాబెటిస్, హైబీపీ, లేదా శ్వాస సంబంధిత సమస్యలున్నవారు ఉన్నారు. ఆసియాలో నమోదవుతున్న 10 శాతం కేసులు నింబస్ వేరియంట్‌కి చెందినవే. అమెరికాలో అయితే ఇది 37 శాతం వరకు ఉంది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంకాంగ్ దేశాల్లోనూ ఈ వేరియంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ప్రమాదకరమా?
WHO ప్రకారం, ఈ వేరియంట్ ఇతర వేరియంట్లతో పోల్చితే, తీవ్రమైన అనారోగ్య పరిణామాలను తక్కువగా కలిగిస్తోంది. కానీ, ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్. వ్యాక్సిన్ వేయించుకోని వారు, రోగనిరోధక శక్తి బలహీనమైన వారు, గర్భిణీలు, వృద్ధులు దీని వల్ల ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.