Health Alert : ఉదయం లేవగానే పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి.. మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది!
Health Alert : ప్రతి ఒక్కరి జీవితంలో ఉదయం చేసే పనులు చాలా కీలకం. ఉదయం ఆరోగ్యకరమైన దినచర్యను పాటించాలని ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ చాలా మంది నిద్ర లేవగానే ఫోన్ చూడటం,
Health Alert : ఉదయం లేవగానే పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి.. మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది!
Health Alert : ప్రతి ఒక్కరి జీవితంలో ఉదయం చేసే పనులు చాలా కీలకం. ఉదయం ఆరోగ్యకరమైన దినచర్యను పాటించాలని ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ చాలా మంది నిద్ర లేవగానే ఫోన్ చూడటం, వెంటనే టీ లేదా కాఫీ తాగడం లాంటి అనారోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు. ఈ అలవాట్లు అప్పటికి కొంచెం సంతోషాన్ని, ఉపశమనాన్ని ఇచ్చినా, దీర్ఘకాలంలో మన ఆరోగ్యంపై, మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని పాడుచేసే ఆ 5 అనారోగ్యకరమైన అలవాట్లు ఏంటో, వాటిని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఉదయం లేవగానే మనం చేసే కొన్ని పనులు మన శరీరంపై, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తప్పనిసరిగా మానుకోవాల్సిన 5 అనారోగ్యకరమైన ఉదయం అలవాట్ల గురించి చూద్దాం.
1. నీరు తాగకుండా ఉండటం
ఉదయం లేవగానే చాలా మంది నీరు తాగడం మరచిపోతారు లేదా నిర్లక్ష్యం చేస్తారు. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఉదయాన్నే నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు మొదలవుతాయి. దీనివల్ల అలసట, బద్ధకం, తలనొప్పి, నోటి దుర్వాసన, పొడి చర్మం, బలహీనమైన రోగనిరోధక శక్తి, మలబద్ధకం, శరీర నొప్పులు వంటి అనేక సమస్యలు రావొచ్చు. ఆరోగ్య సమస్యలన్నిటినీ దూరం చేసుకోవాలంటే, ఉదయం లేవగానే కనీసం రెండు గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం.
2. వెంటనే ఫోన్ చూడటం
నిద్ర లేవగానే చాలా మంది మొదట చేసే పని ఫోన్ చూడటం. ఈ అలవాటు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర లేచిన వెంటనే మెదడు కాస్త నెమ్మదిగా పనిచేస్తుంది. ఆ సమయంలో ఫోన్ చూడటం వల్ల మెదడుకు ఒకేసారి షాక్ ఇచ్చినట్లవుతుంది. అంతేకాకుండా, ఉదయాన్నే బాధ కలిగించే వార్తలు, మెసేజ్‌లు లేదా ఈమెయిల్స్ చూస్తే, అది మీ మానసిక స్థితిని పాడు చేసి, మీ రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్ర లేచిన తర్వాత కనీసం ఒక గంట నుంచి ఒకటిన్నర గంట వరకు ఫోన్‌ను పక్కన పెట్టి, ఇతర పనులపై దృష్టి పెట్టడం మంచిది.
3. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం
వేడి వేడి టీ లేదా కాఫీ తాగడం చాలా మందికి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఖాళీ కడుపుతో ఈ పానీయాలు తాగడం జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. టీ, కాఫీల్లో ఉండే పదార్థాలు కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. ఈ అలవాటు రోజూ కొనసాగితే, మొత్తం జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీకి బదులుగా, గోరువెచ్చని నీరు, హెర్బల్ టీ లేదా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగే అలవాటు చేసుకోవాలి.
4. వ్యాయామం చేయకపోవడం
శారీరక వ్యాయామాన్ని శిక్షగా భావించి మానేయడం వల్ల శరీరం గట్టిపడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వ్యాయామం లేకపోవడం వల్ల కండరాల నొప్పి, కೀళ్ల నొప్పి వస్తాయి. బద్ధకం పెరిగి బరువు కూడా పెరుగుతారు. దీనికి బదులు, కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం లేదా యోగా, స్ట్రెచింగ్, డ్యాన్స్ లేదా మీకు ఇష్టమైన ఏదైనా ఆరోగ్యకరమైన శారీరక శ్రమ చేయడం ఉత్తమం.
5. మల విసర్జన సరిగా లేకపోవడం
ఉదయం మల విసర్జన సరిగా జరిగితేనే శరీరం తేలికగా, ఉల్లాసంగా ఉంటుంది. లేవగానే కాకపోయినా, నిద్ర లేచిన 30 నిమిషాల లోపు కడుపు శుభ్రం కావడం చాలా ముఖ్యం. ఇది జీర్ణ సమస్యలను నివారించడంలో జీవక్రియ సమస్యలను తగ్గించడంలో, మానసిక ఆరోగ్యం చెడిపోకుండా ఉండటంలో సహాయపడుతుంది. మీరు కూడా ఈ అలవాట్లను పాటిస్తున్నట్లయితే వెంటనే వాటిని మార్చుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యమైనది.