Health: వర్షాకాలం పిల్లలు జబ్బుల బారిన పడొద్దంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
Health: వర్షాలు ప్రారంభమవుతూనే అనేక వ్యాధులు వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు వాతావరణ మార్పులకు త్వరగా బలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, వర్షాకాలంలో వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది.
Health: వర్షాలు ప్రారంభమవుతూనే అనేక వ్యాధులు వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు వాతావరణ మార్పులకు త్వరగా బలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, వర్షాకాలంలో వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది.
చేతుల శుభ్రతకు ప్రాధాన్యం
పిల్లలు బయట ఆడి వచ్చాక తల్లిదండ్రులు వారికి చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. భోజనం ముందు, టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత తప్పకుండా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోకి హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించకుండా ఉంటాయి.
నీటి విషయంలో జాగ్రత్త
వర్షాకాలంలో నీటి కారణంగా అనేక వ్యాధులు సంభవిస్తాయి. చిన్నపిల్లలకు మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన గోరువెచ్చని నీటిని మాత్రమే ఇవ్వాలి. బాటిళ్లు లేదా బయట నీరు తాగకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
పరిసరాల పరిశుభ్రత
ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వృద్ధిని తగ్గించవచ్చు. నిల్వ నీటిని వెంటనే తొలగించాలి. ఇంట్లో దోమతెరలు వాడటం, దోమల నివారణ కోసం రిపెల్లెంట్లు వాడటం మంచిది. దీని వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల నుంచి పిల్లలను రక్షించవచ్చు.
వేడి నీటి వినియోగం
చిన్నపిల్లలకు సాధ్యమైనంత వరకు వేడి నీటిని చల్లార్చి ఇవ్వాలి. ఇది ఒంటిలో సూక్ష్మజీవుల దూరంగా ఉండటానికి సహాయపడుతుంది.
వ్యాక్సినేషన్ తప్పనిసరి
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి పిల్లలకు సమయానికి వ్యాక్సిన్లు వేయడం చాలా అవసరం. వ్యాక్సిన్లు జ్వరం, జలుబు, దగ్గు లాంటి వ్యాధుల నుంచి రక్షణను కల్పిస్తాయి.
దోమకాటు నివారణ
చిన్నపిల్లలకు పూర్తి స్లీవ్స్ దుస్తులు వేసేలా చూసుకోవాలి. రాత్రిళ్ళు దోమతెరలను ఉపయోగించడం ద్వారా దోమ కాటు నుంచి రక్షణ పొందొచ్చు. ఈ జాగ్రత్తలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి.
పోషకాహారం అత్యంత ముఖ్యం
వర్షాకాలంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. మంచి ఆహారం తింటే పిల్లల శరీర రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరవు.