Monsoon Health Alert: వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు!
వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తేమతో కూడిన వాతావరణం ఫంగస్ పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. వర్షంలో తడిసిన చెప్పులు, బట్టలు, సాక్సులు త్వరగా ఆరకపోవడం వల్ల ఫంగస్ వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Monsoon Health Alert: వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు!
Monsoon Health Alert: వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తేమతో కూడిన వాతావరణం ఫంగస్ పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. వర్షంలో తడిసిన చెప్పులు, బట్టలు, సాక్సులు త్వరగా ఆరకపోవడం వల్ల ఫంగస్ వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారి, శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు
చర్మ, జుట్టు, గోళ్ల మీద ఫంగల్ ఇన్ఫెక్షన్లు ప్రభావం చూపుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు తేలికపాటివి నుంచి తీవ్రమైనవిగా ఉంటాయి. మొదట చర్మంపై దురద, మంట వస్తుంది. ఆ తర్వాత ఎర్రటి దద్దుర్లు, పొక్కులు కనిపిస్తాయి. పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే, పాదాల మధ్య తెల్లటి పొర లేదా పగుళ్లు ఏర్పడవచ్చు.
గోళ్లకు ఇన్ఫెక్షన్ వస్తే గోళ్లు గట్టిగా మారి, రంగు మారడం లేదా పగిలిపోవడం జరగవచ్చు. జుట్టులో ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల తల చర్మంపై దురద, చుండ్రు వంటి పొరలు ఏర్పడతాయి. తీవ్రమైన సందర్భాలలో చర్మంపై లోతైన పుండ్లు ఏర్పడి, నొప్పి, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి లేదా డయాబెటిస్ రోగులకు ఈ ఇన్ఫెక్షన్లు తీవ్రమైనవిగా మారవచ్చు. కొన్నిసార్లు ఈ ఫంగస్ రక్తంలో కూడా కలిసిపోయి, చర్మంపై లోతైన పుండ్లు ఏర్పడవచ్చు. అందువల్ల, మొదటి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.
ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఎలా?
వర్షాకాలంలో తడిసిన బూట్లు, సాక్సులు, బట్టలను వెంటనే మార్చండి. పాదాలను పొడిగా ఉంచుకోండి. ఇతరుల వస్తువులైన తువ్వాళ్లు, బట్టలు, బూట్లు మొదలైన వాటిని ఉపయోగించవద్దు. శరీరాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి. ప్రతిరోజు స్నానం చేయండి. చర్మంపై తేమ ఉండే ప్రదేశాలలో యాంటీఫంగల్ పౌడర్ లేదా క్రీమ్ వాడండి. ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.