Monsoon Diet Alert: బీపీ, షుగర్ ఉన్నవారు ఈ ఆకుకూరలకు దూరంగా ఉండాలి!

వర్షాకాలం వచ్చిందంటే చల్లదనంతో పాటు ఆరోగ్య సమస్యలూ పుట్టుకొస్తాయి. ఈ కాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటంతో బ్యాక్టీరియా, ఫంగస్‌ వృద్ధికి ఇది అనుకూలమైన వాతావరణంగా మారుతుంది.

Update: 2025-07-07 14:15 GMT

Monsoon Diet Alert: బీపీ, షుగర్ ఉన్నవారు ఈ ఆకుకూరలకు దూరంగా ఉండాలి!

Monsoon Diet Alert: వర్షాకాలం వచ్చిందంటే చల్లదనంతో పాటు ఆరోగ్య సమస్యలూ పుట్టుకొస్తాయి. ఈ కాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటంతో బ్యాక్టీరియా, ఫంగస్‌ వృద్ధికి ఇది అనుకూలమైన వాతావరణంగా మారుతుంది. ముఖ్యంగా షుగర్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు ఆహార విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరంగా భావించే ఆకుకూరలే ఈ సీజన్‌లో శరీరానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది.

పాలకూరలో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షాకాలంలో దానిపై మట్టితో పాటు కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఉంటాయి. కడిగినా పూర్తిగా శుభ్రం కావు. అంతేకాకుండా పాలకూరలో ఉండే ఆక్సలేట్లు, సహజ సోడియం కిడ్నీల పనితీరును ప్రభావితం చేసి బీపీని పెంచే అవకాశమూ ఉంది. అదే విధంగా మెంతికూర షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుందన్న నిజం ఉన్నా వర్షాకాలంలో ఇందులో పుట్టే ఫంగస్, క్రిముల వలన పేగుల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాగే షుగర్ మందులు వాడే వారు మెంతికూరను అధికంగా తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గిపోయే అవకాశమూ ఉంది.

వర్షాకాలంలో తోటకూరను ఎక్కువ కాలం నిల్వ ఉంచలేరు. తేమ కారణంగా బ్యాక్టీరియా వేగంగా పెరిగి, ఇది ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ఆవకూరలో వాతావరణ కాలుష్యం, వర్షపు నీరు సులభంగా ఇమిడి ఉండే గుణం ఉంది. వీటి వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి వంటి సమస్యలు రావచ్చు. అలాగే కొత్తిమీరను చాలామంది సలాడ్‌ల్లో లేదా పచ్చిగానే వాడుతుంటారు. కానీ వర్షాకాలంలో ఇది అత్యంత ప్రమాదకరం. ఇందులో ఉండే బ్యాక్టీరియా, క్రిములు విరేచనాలు, జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. లెట్యూస్ ఆకుకూరలో కూడా మడతల్లో బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చిగా తింటే కలరా, టైఫాయిడ్‌ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఈ వర్షాకాలంలో ఆకుకూరలను పచ్చిగానీ, అర్ధపక్వంగా గానీ తినరాదు. బాగా కడిగి, ఉప్పు నీటిలో లేదా వెనిగర్ కలిపిన నీటిలో నానబెట్టి వాడాలి. మట్టి, క్రిములు పూర్తిగా తొలగిన తర్వాత మాత్రమే వండాలి. వీటిని పూర్తిగా ఉడికించి తింటే బ్యాక్టీరియా నశించి, శరీరానికి హానికరం కాకుండా ఉంటుంది. బయట బండ్ల మీద అమ్మే కట్ చేసిన ఆకుకూరలను కొనడం తగదు. ఎలాంటి ఆకుకూర అయినా కూడా మితంగా తీసుకోవాలి. ఈ తరహా జాగ్రత్తలతో వర్షాకాలంలో బీపీ, షుగర్ లెవల్స్‌ను సమతుల్యంగా ఉంచుకోవచ్చు.


Tags:    

Similar News