Moles Cancer: పుట్టుమచ్చలే కదా అని అనుకోవద్దు.. అందరినీ భయపెడుతున్న మోల్ క్యాన్సర్
Moles Cancer: పుట్టుమచ్చలనేవి అందరికీ ఉంటాయి. అయితే ఇవి శరీరానికి కుడివైపున ఒకటని, ఎడమవైపున ఇంకొకటని పెద్దవాళ్లు చాలామంది ఏవేవో చెబుతుంటారు
Moles Cancer: పుట్టుమచ్చలే కదా అని అనుకోవద్దు.. అందరినీ భయపెడుతున్న మోల్ క్యాన్సర్
Moles Cancer: పుట్టుమచ్చలనేవి అందరికీ ఉంటాయి. అయితే ఇవి శరీరానికి కుడివైపున ఒకటని, ఎడమవైపున ఇంకొకటని పెద్దవాళ్లు చాలామంది ఏవేవో చెబుతుంటారు. కానీ పుట్టుమచ్చలతో అలాంటి లాభాలు ఉంటాయో లేదో తెలియదు కానీ, పుట్టుమక్చల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం .. జర భద్రంగా ఉండండని డాక్టర్లు చెబుతున్నారు.
పుట్టుమచ్చలనేవి చర్మంపై ఏర్పడే చిన్న చిన్న మచ్చలు. ఇవి చర్మంలోని మెలనోసైట్స్ అనే కణాలు ఒకే చోట గుమిగూడి ఉండటం వల్ల ఏర్పడతాయి. సాధారణంగా ఇవి గోధుమరంగు, నలుపు రంగుల్లో ఉంటాయి. కొంతమంది ఎర్రని రంగుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి చాలావరకు హానిచేయనివే ఉంటాయి. అయితే కొన్ని పుట్టిమచ్చలు చర్మ క్యాన్సర్ కు సంకేతాలు మారుతున్నాయని డాక్టర్లు అంటున్నారు.
పుట్టుమచ్చల క్యాన్సర్ (మెలనోవా) అనేది చర్మ క్యాన్సర్ యొక్క రకం. ఇది సాధారణంగా పుట్టుమచ్చలలో మొదలవుతుంది. అలాగే వేగంగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా పుట్టుమచ్చల్లో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
ఎలాంటి మార్పులు వస్తాయి?
పుట్టుమచ్చ ఆకారంలో , పరిమాణంలో లేదా రంగులో మార్పు వస్తుంది.
పుట్టుమచ్చ అంచు క్రమరహితంగా ఉంటుంది.
పుట్టుమచ్చ చుట్టూ కొత్త కొత్త పుట్టుమచ్చలు వస్తాయి.
పుట్టుమచ్చల్లో దురద లేదా రక్త స్రావం జరుగుతుంది
నల్లగా ఉన్న పుట్టుమచ్చలు ఎర్రడా మారిపోతుంది.
ఒక్కసారిగా వాపు వచ్చి అది తగ్గకపోవడం జరుగుతుంది.
పుట్టుమచ్చని పట్టుకుంటే నొప్పి రావడం, మృదువుగా లేకపోవడం ఉంటుంది.
పుట్టుమచ్చపైనున్న పొర ఊడి పోతుంటుంది. లేదా పొలుసులుగా మారుతుంది.
నివారణ ఏంటి?
డాక్టర్‌ని వెంటనే సంప్రదించాలి. ఒకవేళ క్యాన్సర్ అని రుజువైతే ఆపరేషన్ ద్వారా పుట్టుమచ్చను తొలగిస్తారు. ఇందులో రేడియేషన్, కీమోధెరపీ, ఇమ్యునోథెరపీలు ఉంటాయి.
ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పుట్టుమచ్చల్ని తరచూ పరీక్షించుకోవాలి. ఎండకు ఎక్కువగా తిరిగేవాళ్లు సర్ స్క్రీన్ వాడాలి. మంచి ఆహారం తినాలి. పుట్టుమచ్చల్లో ఏదైనా చిన్న మార్పు కనిపించినా డాక్టర్‌ని సంప్రదించాలి.