బరువు తగ్గేందుకు మిల్లెట్ టీ ... వేగంగా కొవ్వు కరిగించే సింపుల్ రెసిపీ!
తృణధాన్యాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జొన్నలు, సజ్జలు, రాగులు మొదలైన మిల్లెట్స్‌ను వాడుతూ రొట్టెలు, జావ, దోశలు వంటివి తయారుచేస్తూ ఉన్నా, ఇప్పుడు వీటితో ‘మిల్లెట్ టీ’ తయారు చేయడం ఓ కొత్త ప్రయోగంగా మారింది.
బరువు తగ్గేందుకు మిల్లెట్ టీ ... వేగంగా కొవ్వు కరిగించే సింపుల్ రెసిపీ!
తృణధాన్యాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జొన్నలు, సజ్జలు, రాగులు మొదలైన మిల్లెట్స్‌ను వాడుతూ రొట్టెలు, జావ, దోశలు వంటివి తయారుచేస్తూ ఉన్నా, ఇప్పుడు వీటితో ‘మిల్లెట్ టీ’ తయారు చేయడం ఓ కొత్త ప్రయోగంగా మారింది. ప్రత్యేకించి బరువు తగ్గాలనుకునే వారికి ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది.
మిల్లెట్ టీ త్రాగడంలో స్పెషల్ ఏమిటంటే?
ఇది కేవలం టీ మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడే ఓ స్మార్ట్ డ్రింక్. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఈ మిల్లెట్ టీని ప్రత్యేకంగా నిలబెడతాయి.
అవసరమైన పదార్థాలు:
సజ్జలు, రాగులు (ఒక రాత్రంతా నానబెట్టాలి)
టీ పొడి – చిటికెడు
యాలకులు, అనాస పువ్వు
అల్లం ముక్క
డేట్స్ పౌడర్ లేదా అర చెంచా బెల్లం
నీళ్లు – సరిపడా
తయారీ విధానం:
ముందుగా నానబెట్టిన సజ్జలు, రాగులను మిక్సీ చేసి వడగట్టి పాలలాగా ఉండే మిల్లెట్ రసం తయారుచేయాలి.
వేరే పాన్‌లో నీళ్లు వేసి టీ పొడి, యాలకులు, అనాస పువ్వు, అల్లం ముక్క వేసి మరిగించాలి.
మరిగే నీళ్లలో మిల్లెట్ రసం కలిపి 1 నిమిషం మిక్స్ చేయాలి.
స్టవ్ ఆఫ్ చేసి, తీపి కోసం బెల్లం లేదా డేట్స్ పౌడర్ చేర్చాలి.
ఎలా తాగాలి?
వారంలో 2–3 సార్లు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు.
చక్కెర మాత్రం ఉపయోగించరాదు. బెల్లం లేదా డేట్స్ పౌడర్‌తో తాగాలి.
జీర్ణ సమస్యలు, bloating, అధిక తలదిండి లాంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఇది ఐరన్, కాల్షియం, మినరల్స్ సమృద్ధిగా అందిస్తుంది.
ఎవరు తాగకూడదు?
థైరాయిడ్ ఉన్నవారు మిల్లెట్‌ను తగ్గించాలి.
మిల్లెట్స్ తింటే పొట్టపొంగటం, అసిడిటీ లాంటి సమస్యలుంటే ఈ టీని వాడొద్దు.
గమనిక: ఇది ఆరోగ్య సమాచారం మాత్రమే. వాడకానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
ఈ సింపుల్ మిల్లెట్ టీ రిసిపీ మీ రోజువారీ ఆరోగ్య రొటీన్‌లో భాగం అయితే, బరువు తగ్గడం మాత్రమే కాదు, శరీరానికి శక్తి, జీర్ణశక్తి రెండూ కూడా మెరుగవుతాయి.