Mens Skin: వేసవిలో ఈ చిట్కాలు పాటిస్తే పురుషుల చర్మం మెరిసిపోతుంది..!

Mens Skin: సాధారణంగా పురుషులు తమ చర్మంపై పెద్దగా శ్రద్ద చూపరు.

Update: 2022-06-06 04:30 GMT

Mens Skin: వేసవిలో ఈ చిట్కాలు పాటిస్తే పురుషుల చర్మం మెరిసిపోతుంది..!

Mens Skin: సాధారణంగా పురుషులు తమ చర్మంపై పెద్దగా శ్రద్ద చూపరు. అయితే వేసవిలో చర్మ సంరక్షణ అనేది ఎవ్వరికైనా ముఖ్యం. ఈ సమయంలో పురుషులు వారి చర్మంపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ప్రతిరోజూ నిద్రవేళకు ముందు ముఖం కడుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రుద్దండి. ఇది మీ చర్మాన్ని త్వరగా పాడు చేయదు. గ్లో అలాగే ఉంటుంది.

రోజుకు రెండుసార్లు ముఖం కడగాలి

వేసవిలో రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడానికి ప్రయత్నించాలి. నిజానికి పురుషుల చర్మం జిడ్డుగా ఉంటుంది. ఈ పరిస్థితిలో వారు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని సరిగ్గా కడుక్కోవడం వల్ల రంధ్రాలలో ఉండే మురికిని శుభ్రం చేసుకోవచ్చు. అంతే కాకుండా చర్మంలో పేరుకుపోయిన అదనపు జిడ్డును తొలగించుకోవచ్చు.

ఇలా ముఖం శుభ్రం చేసుకోండి

స్త్రీల కంటే పురుషుల చర్మం చాలా బిగుతుగా, మందంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో, పురుషులు మరింత జాగ్రత్త వహించాలి. ముఖాన్ని శుభ్రం చేయడానికి మంచి టోనర్ ఉపయోగించాలి. ఇది మీ చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

సహజ స్క్రబ్బింగ్

ఇది కాకుండా వేసవిలో ముఖాన్ని సహజంగా స్క్రబ్బింగ్ చేయడం అవసరం. దీంతో మృతకణాలు బయటకు వస్తాయి. పురుషులు సాధారణంగా ప్రతి 3 రోజులకు ఒకసారి స్క్రబ్బింగ్ చేయాలి. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మాయిశ్చరైజర్ అవసరం

మీ చర్మాన్ని ఎల్లప్పుడూ మాయిశ్చరైజింగ్ చేస్తూ ఉండాలి. వేసవిలో తేలికపాటి మాయిశ్చరైజర్‌తో మీ చర్మం ఎల్లప్పుడూ బాగుంటుంది. ఇది చర్మంపై ముడతలు పడే అవకాశాలను తగ్గిస్తుంది.

Tags:    

Similar News