Maruti: మారుతి సరికొత్త ప్లాన్.. కేవలం రూ.4.23లక్షలకే 6ఎయిర్ బ్యాగులున్న కారు

Maruti: భారత మార్కెట్లో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకికి తిరుగులేదు. అయితే, ఇప్పుడు మారుతి తన కార్ల అమ్మకాలను మరింత పెంచుకోవడానికి ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది.

Update: 2025-08-04 09:30 GMT

Maruti: భారత మార్కెట్లో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకికి తిరుగులేదు. అయితే, ఇప్పుడు మారుతి తన కార్ల అమ్మకాలను మరింత పెంచుకోవడానికి ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. అదే, సేఫ్టీ. కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని, మారుతి తన దాదాపు అన్ని కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఈ జాబితాలో ఎంట్రీ లెవెల్ కార్లైన ఆల్టో K10, సెలెరియో, వాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్ లాంటి మోడళ్లు కూడా ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లను అన్ని వేరియంట్లలో తప్పనిసరి చేసిన తర్వాత, మారుతి కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా, తక్కువ ధర కార్ల బుకింగ్స్ విపరీతంగా పెరిగాయి. దీనివల్ల కార్ల ధరలు కాస్త పెరిగినా, భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో లభించే అతి తక్కువ ధర కారు 4.23 లక్షల రూపాయలతో ప్రారంభమవుతుంది.

మారుతి వెల్లడించిన సమాచారం ప్రకారం.. వాగన్ఆర్ మోడల్‌కు బుకింగ్స్ ఎక్కువగా పెరిగాయి. అలాగే, సెలెరియో, వాగన్ఆర్, స్విఫ్ట్ వంటి కార్ల బుకింగ్స్ జులై నెలలో 7 శాతం పెరిగాయి. మరోవైపు, మారుతి ప్రీమియం కార్ల అమ్మకాల్లో మాత్రం కాస్త తగ్గుదల కనిపించింది. బ్రెజా, ఫ్రాంక్స్, జిమ్నీ, గ్రాండ్ విటారా లాంటి మోడళ్ల అమ్మకాలు 6.3 శాతం తగ్గాయి. ఈ కేటగిరీలో కేవలం 52,773 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

అయితే, ఎంట్రీ లెవెల్ కార్లైన ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు ఏకంగా 31.5 శాతం పడిపోయాయి. వీటి అమ్మకాలు కేవలం 6,822 యూనిట్లు మాత్రమే. 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న అతి తక్కువ ధర కారుగా ఆల్టో K10 మార్కెట్లో బాగా పాపులర్ అయింది. దీని ఫీచర్లు, ఇంజిన్ వివరాల్లోకి వెళితే.. ఇందులో 1-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 bhp పవర్‌ను, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంటుంది. CNG వెర్షన్‌లో కూడా ఇదే ఇంజిన్ ఉంటుంది. కానీ ఇది 56 bhp పవర్, 82 Nm టార్క్‌ను ఇస్తుంది.

7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ORVMలు, రియర్ డిఫాగర్, వైపర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, స్ప్లిట్ రియర్ సీటు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మొత్తానికి, మారుతి సుజుకి సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తన అమ్మకాలను పెంచుకోవడమే కాకుండా, కస్టమర్ల విశ్వాసాన్ని కూడా పొందుతోంది.

Tags:    

Similar News