Kids sleep tips: పిల్లలు హాయిగా నిద్రపోవడానికి 4 సూపర్ టిప్స్ ఇవే..
Kids sleep tips: మీ పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదా? ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ 4 సూపర్ టిప్స్ పాటించండి.
Kids sleep tips: పిల్లలు హాయిగా నిద్రపోవడానికి 4 సూపర్ టిప్స్ ఇవే..
పిల్లలు తగినంత నిద్రపోవడం లేదని కొందరు, అతిగా నిద్రపోతున్నారని మరికొందరు తల్లిదండ్రులు తరచూ ఆందోళన చెందుతుంటారు. అసలు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన ఇంధనం వంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ (NSF) నివేదికల ప్రకారం, వయస్సును బట్టి పిల్లలకు అవసరమైన నిద్ర మారుతూ ఉంటుంది. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇటీవల నిర్వహించిన పలు సర్వేల ప్రకారం.. దాదాపు 44% మంది పిల్లలు తమ వయస్సుకు తగినంత నిద్రపోవడం లేదు. ఇది కేవలం పిల్లలకే కాదు, మొత్తం కుటుంబంపై ప్రభావం చూపుతోంది. 80% మంది తల్లిదండ్రులు తమ పిల్లల నిద్రలేమి కారణంగా తమ దినచర్య, నిద్ర కూడా పాడవుతోందని అంగీకరించారు. మంచి నిద్ర ఉన్న పిల్లల్లో మానసిక స్థితి (Mood), ప్రవర్తన 86% మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.74% మంది తల్లిదండ్రులు రోజుకు రెండు గంటల సమయం తమ బిడ్డ నిద్ర గురించి ఆందోళన చెందుతూనే గడుపుతున్నారని వెల్లడైంది.
4 సూపర్ టిప్స్..
కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే నిద్రకు సంకేతం కాదు. పిల్లల కోసం ఒక 'స్లీప్ రొటీన్' ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులకు నిపుణులు సూచిస్తున్నారు.
* పడుకునే ముందు గదిలోని లైట్లను డిమ్ చేయడం, కిటికీలకు కర్టెన్లు వేయడం లేదా ఒక చిన్న కథ చదివి వినిపించడం అలవాటు చేయండి. ఇది మెదడుకు "నిద్రపోయే సమయం ఆసన్నమైంది" అనే సంకేతాన్ని వారికి ఇస్తుంది.
* పడుకోవడానికి గంట ముందు మొబైల్ ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్స్ పూర్తిగా బంద్ చేయండి. ప్రశాంతమైన సంగీతం లేదా పుస్తక పఠనం వైపు వారిని మళ్లించండి.
* ఉదయం నిద్రలేవగానే పిల్లలను కాసేపు ఎండలో ఉండనివ్వండి. ఇది శరీరంలోని జీవ గడియారాన్ని (Circadian Rhythm) క్రమబద్ధీకరిస్తుంది.
* పగటిపూట పిల్లలు బాగా ఆడుకునేలా చూడండి. అయితే, నిద్రపోయే ముందు మాత్రం భారీ వ్యాయామాలు లేదా గెంతులు వేయడం వంటివి చేయనివ్వకండి.
పిల్లల నిద్ర విషయంలో క్రమశిక్షణ పాటిస్తే, అది వారి భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. పైన పేర్కొన్న చిన్న చిన్న మార్పులతో మీ బిడ్డకు ప్రశాంతమైన నిద్రను అందించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.