Health Tips: మూత్రంలో రక్తం పడుతోందా? అది కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు!
Health Tips: మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. కిడ్నీ సమస్యలు, యూరినరీ ఇన్‌ఫెక్షన్ లేదా క్యాన్సర్‌కు కూడా సంకేతం కావచ్చని వైద్యుల హెచ్చరిక!
Health Tips: మూత్రంలో రక్తం పడుతోందా? అది కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు!
Health Tips: యూరిన్‌లో (మూత్రంలో) రక్తం రావడం అనేది సాధారణ విషయం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలో రాళ్ల వల్ల సంభవించ వచ్చని అంటున్నారు. అయితే కానీ కొన్నిసార్లు ఇది కిడ్నీ క్యాన్సర్‌కు కూడా సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు. మూత్రంలో రక్తం పడటం అనేది అస్సలు విస్మరించకూడని సంకేతం అని చెబుతున్నారు. మూత్రంలో రక్తం రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, దాంతో వచ్చే ప్రధాన సమస్యలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మూత్రంలో రక్తం రావడానికి ప్రధాన కారణాలు ఇవే..
* మూత్రనాళ ఇన్ఫెక్షన్
* కిడ్నీలో రాళ్లు
* కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్
* ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్యలు
క్యాన్సర్ అని ఎలా గుర్తించాలంటే..
కేవలం మూత్రంలో రక్తం రావడం మాత్రమే క్యాన్సర్ కాదని, కానీ ఈ కింద పేర్కొన్న లక్షణాలు కూడా దానికి తోడైతే అది కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
* మూత్రంలో పదే పదే రక్తం రావడం.
* నడుముకు ఒక వైపు విపరీతమైన నొప్పి ఉండటం.
* అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం.
పైన పేర్కొన్న లక్షణాలు దీర్ఘకాలంగా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఒకవేళ క్యాన్సర్ అయితే, దీనిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని వైద్య నిపుణులు సూచించారు. సమస్య తీవ్రతను పరీక్షలు చేయాలని వైద్యులు పేర్కొన్నారు.
* యూరిన్ టెస్ట్: ప్రాథమిక తనిఖీ కోసం.
* అల్ట్రాసౌండ్ స్కాన్: కిడ్నీల పరిస్థితిని చూడటానికి.
* సిస్టోస్కోపీ: తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు చేసే ప్రత్యేక పరీక్ష.
ఒక రోజు రక్తం వచ్చి ఆగిపోతే పర్వాలేదు కానీ, రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈ సమస్య ఉంటే వేధిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించాలన్నారు.