Hair Loss: ఈ పొరపాట్ల వల్లే జుట్టు రాలుతోంది.. బట్టతల వచ్చేస్తోంది..!

Hair Loss: నేటి కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యని ఎదుర్కొంటున్నారు.

Update: 2022-07-20 15:45 GMT

Hair Loss: ఈ పొరపాట్ల వల్లే జుట్టు రాలుతోంది.. బట్టతల వచ్చేస్తోంది..!

Hair Loss: నేటి కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు కొంతమందికి జుట్టు రాలి రాలి బట్టతల వచ్చేస్తోంది. చాలామంది చిన్నవయసులోనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని తగ్గించడానికి ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతున్నారు. అయినా ఎటువంటి ఫలితం ఉండటం లేదు. వాస్తవానికి జుట్టు రాలడానికి, బట్టతలకి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది మీరు మీ జుట్టును ఎలా చూసుకుంటారనేది ముఖ్యం. చాలా సార్లు మనం కొన్ని పొరపాట్లు చేస్తాం. దీనివల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. నిద్రపోయేటప్పుడు జుట్టును బిగుతుగా కట్టుకోవడం

కొందరు నిద్రిస్తున్నప్పుడు జుట్టును గట్టిగా కట్టుకుంటారు. ఇది జుట్టు మూలాలను బలహీనంగా మారుస్తుంది. బిగుతుగా ఉండే రబ్బర్‌ని అప్లై చేయడం వల్ల కూడా జుట్టు విరిగిపోతుంది. ఇలా అస్సలు చేయకూడదు. జుట్టు వదులుగా ఉండే రబ్బరుతో కట్టుకుంటే చాలు.

2. దువ్వే విధానం

కొందరు ఉదయం నిద్ర లేవగానే జుట్టు దువ్వుకుంటారు. చాలా మంది ముందు నుంచి వెనుకకు దువ్వుకుంటారు. ఇది తప్పు. దీనివల్ల మరింత జుట్టు రాలుతోంది. వెనుక వెంట్రుకలు చిక్కుపడిపోతాయి. కాబట్టి ముందుగా వెనుక వెంట్రుకలను దువ్వి తర్వాత ముందు వెంట్రుకలను దువ్వాలి.

3. నూనెను పూసే విధానం

కొంతమంది జుట్టు మూలాలకు చాలా నూనెను అప్లై చేసి గట్టిగా రుద్దుతారు. దీని వల్ల జుట్టు ఎక్కువగా విరిగిపోతుంది. జుట్టుకి ఎప్పుడైన తేలికగా మృదువుగా నూనె అప్లై చేయాలి. ఇది మీ జుట్టును మెరిసేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

4. జుట్టును కడుక్కునే విధానం

చాలా సార్లు జుట్టును తడిపి నేరుగా షాంపూ రాసుకుంటారు. దీని వల్ల హానికరమైన రసాయనాలు జుట్టుకు హాని చేస్తాయి. షాంపూ చేయడానికి మగ్‌లో నీటితో పాటు షాంపూని కలపండి. అందులో నుంచి అర కప్పు తీసుకొని జుట్టును కిందికి వంచి ఆపై తేలికపాటి చేతులతో షాంపూ చేయండి.

Tags:    

Similar News