White Hair: చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తుందా.. ఇదే కారణం..?

White Hair: చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తుందా.. ఇదే కారణం..?

Update: 2022-02-04 10:30 GMT

White Hair: చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తుందా.. ఇదే కారణం..?

White Hair: ఇటీవల చాలామందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు కనిపిస్తుంది. స్కూల్‌ కెళ్లే వయసులో జుట్టు తెల్లబడుతుంది. దీంతో పిల్లలు క్లాసులో అల్లరిపాలు కావల్సి వస్తోంది. ఈ సమస్య ఒక్క అబ్బాయిలకు కాదు అమ్మాయిలు కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం చెడు జీవనశైలితో పాటు పోషకాహారలోపం అని చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడటానికి పిల్లల డైట్‌లో మార్పులు చేసి డాక్టర్‌ని సంప్రదించాలి. అయితే ఏ ఆహారాలు తింటే మంచిదో ఈ రోజు తెలుసుకుందాం.

పచ్చని ఆకు కూరలలో విటమిన్ ఈ, సి పుష్కలంగా లభిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మం, వెంట్రుకల ప్రదేశాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. నిజానికి తలలో రక్త ప్రసరణ సరిగా  జరగకపోవడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం మొదలవుతుంది. ఈ పరిస్థితిలో పిల్లలు ఖచ్చితంగా ఆకు కూరలు తినాల్సి ఉంటుంది. కోడి గుడ్డు పిల్లల ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారంగా చెబుతారు. ఇందులో ఉండే ప్రొటీన్ ఆరోగ్య పరంగా చాలా మేలు చేస్తుంది. మీ పిల్లలు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడితే వారానికి కనీసం మూడు సార్లు గుడ్లు తినిపించండి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య దూరమై జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే ఏ కాలంలో దొరికే పండ్లని ఆ కాలంలో తీసుకుంటే చాలా పోషకాలు లభిస్తాయి. అంతేకాదు సీజనల్‌ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. విటమిన్‌ సి ఉండే నారింజ, దానిమ్మ, జామ, క్యారెట్‌, బొప్పాయి వంటివి అధికంగా తీసుకోవాలి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్‌ కూడా తీసుకోవాలి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. ఇది మాత్రమే కాదు అనేక డ్రై ఫ్రూట్స్‌లో రాగి ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మీకు కావాలంటే పిల్లల ఆహారంలో బాదం, వాల్‌నట్‌లను చేర్చవచ్చు ఎందుకంటే వాటికి మెలనిన్‌ను పెంచే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. 

Tags:    

Similar News