Malaria Vaccine Cost: రూ.429లకే మలేరియా వ్యాక్సిన్.. వెల్లడించిన భారత్ బయోటిక్
Malaria Vaccine Cost: పిల్లలకు మలేరియా రాకుండా వేసే మలేరియా వ్యాక్సిన్ ఇక నుంచి తక్కువ ధరలో దొరకనుంది.
Malaria Vaccine Cost: రూ.429లకే మలేరియా వ్యాక్సిన్.. వెల్లడించిన భారత్ బయోటిక్
Malaria Vaccine Cost: పిల్లలకు మలేరియా రాకుండా వేసే మలేరియా వ్యాక్సిన్ ఇక నుంచి తక్కువ ధరలో దొరకనుంది. 2028 నాటికి ఈ వ్యాక్సిన్ ధరను సగానికి పైగా తగ్గించనున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం ప్రకటించింది. దీంతో మలేరియా వ్యాక్సిన్ ఇక రూ.429లకే అందుబాటులోకి రానుంది.
చిన్నపిల్లలకు వేసే మలేరియా వ్యాక్సిన్ ఇక నుంచి తక్కువ ధరలో అందుబాటులోకి తేనున్నట్లు భారత్ బయోటిక్ ప్రకటించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, జీఎస్‌కే పీఎల్‌సీ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆర్ టీఎస్–ఎస్ వ్యాక్సిన్‌ను ఇక నుంచి రూ. 429 లకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు వెల్లడించింది. అంతకుముందు ఈ వ్యాక్సిన్ ధర రూ. 859లు ఉంది. ప్రస్తుతం ధర కనీసం 60 శాతం తగ్గింది.
అందరికీ అందుబాటులోకి వ్యాక్సిన్‌ని అందించాలనే కారణంతో వ్యాక్సిన్ ధరను భారత్ బయోటిక్ తగ్గించింది. ఇది 2028 నుంచి అమలులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారత్, ఆఫ్రికా వంటి దేశాల్లో ఉన్న పిల్లలకు మలేరియా సోకకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్లను అందిస్తారు.
నిజానికి సంవత్సరానికి దాదాపు 5 లక్షల మంది పిల్లలు మలేరియా బారిన పడి చనిపోతున్నారు. అందుకే ఆఫ్రికాలో తక్కువ ధరకే మలేరియా వ్యాక్సిన్లను అందించేందుకు స్వచ్చంధ సంస్థ అయిన గవి పనిచేస్తుంది. ఈ సంస్థకు జీఎస్‌కే వ్యాక్సిన్లను అందిస్తుంది. ఈ సందర్భంగా భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాకిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, ఈ వ్యాక్సిన్‌లను గవికి సరఫరా చేసేందుకు 2021లో ఒప్పందం కుదరిందని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ల తయారీ, అభివృద్ధి కోసం భారత్ బయోటెక్ దాదాపు 200 మిలియన్ల పెట్టుబడి పెట్టిందని ఈ సందర్భంగా కృష్ణ అన్నారు.