Health News: 100 ఏళ్లు బతకాలంటే ఆహారంలో ఈ మార్పులు చేయండి..!

Health News: దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం అనేవి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు...

Update: 2022-05-02 09:30 GMT

Health News: 100 ఏళ్లు బతకాలంటే ఆహారంలో ఈ మార్పులు చేయండి..!

Health News: దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం అనేవి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఈ రెండింటిని సాధించడం మన చేతుల్లోనే ఉంది. మనం ఏమి తింటాం ఏమి తినకూడదు అనే దానిపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆహారం గురించి ఎప్పటికప్పుడు అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఒక పరిశోధన గురించి తెలుసుకుందాం. ఈ పరిశోధనను సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వాల్టర్ లాంగో, రోజలిన్ ఆండర్సన్ చేశారు.

పోషకాహారానికి సంబంధించి చేసిన అన్ని అధ్యయనాలు పరిశీలించిన తర్వాత సరైన ఆహారం దీర్ఘాయువు, ఆరోగ్యకరమైన జీవనానికి సహకరిస్తుందన్నారు. మీ డైట్‌లో మీడియం నుంచి అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయని ఈ పరిశోధన వెల్లడించింది. శరీరానికి అవసరమైనంత మాత్రమే ప్రోటీన్ తీసుకోవాలి. ఈ ప్రోటీన్‌లో ఎక్కువ భాగం మొక్కలు చెట్ల నుంచి లభించే ఆహారం నుంచి తీసుకోవాలి.

వీటి ద్వారా లభించే FAT శరీరానికి అవసరమైన 30% శక్తిని అందిస్తుంది. దీర్ఘాయువు కోసం మీరు కూరగాయలు, అన్ని రకాల ధాన్యాలు, కొంత మొత్తంలో చేపలను ఆహారంలో చేర్చుకోవాలని ప్రొఫెసర్ లాంగో వివరిస్తున్నారు. మీ ప్లేట్ నుంచి ఎర్ర మాంసాన్ని పూర్తిగా తొలగించాలన్నారు. తెల్ల మాంసం చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చని సూచించారు. చక్కెర తక్కువగా తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌ను మంచి పరిమాణంలో తినాలి.

కొంత మొత్తంలో డార్క్ చాక్లెట్‌ను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. ఈ రీసెర్చ్‌లో ఏం తినాలి అని చెప్పారు కానీ ఎంత తినాలి అనేది మాత్రం చెప్పలేదు. అందుకే ఈ పరిశోధనలో పేర్కొన్న ఏ ఆహారం అయినా ఆరోగ్యం, వయస్సును దృష్టిలో ఉంచుకుని పాటించాలని ప్రొఫెసర్ లాంగో చెప్పారు. ప్రతి వ్యక్తి డైటీషియన్ పర్యవేక్షణలోప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News