Health: చెరువులో దొరికే ఈ కాడతో యూరిక్ యాసిడ్ ఇట్టే మాయం.. ఇంతకీ అదేంటంటే
Health: ఈ రోజుల్లో చిన్న వయస్సు నుంచే చాలామందిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం సాధారణం అయిపోయింది. దీనివల్ల కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు, శరీరంలోని నలత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రొటీన్ల జీర్ణం సరిగ్గా కాకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.

అలాంటి పరిస్థితుల్లో శరీరానికి సహజంగా ఉపశమనం ఇచ్చే ఒక ప్రత్యేకమైన సహజాహారంగా కమలం కాడ (తామర కాడ) చక్కటి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. కమలం కాడలో పుష్కలంగా ఉండే ఫైబర్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడటమే కాకుండా, యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
తామర కాడలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) లక్షణాలు శరీరంలోని ఉబ్బసం, వాపులు, నొప్పులు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ప్రత్యేకంగా గౌట్ (Gout) ఉన్నవారికి ఎంతో ఉపశమనం ఇస్తుంది.
తామర కాడలో ఉండే పోషకాల వల్ల ఎముకలు బలపడతాయి. ఇది శరీర నిర్మాణానికి ఉపయోగపడడమే కాకుండా కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. అధిక యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే నొప్పులకు ఇది సహజమైన నివారణగా పని చేస్తుంది.
ఈ కాడ రక్తంలో ఐరన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది మెటబాలిజం (జీవక్రియ)ను వేగవంతం చేస్తుంది. దీనివల్ల ప్రొటీన్లు సులభంగా జీర్ణమై, యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం తగ్గుతుంది.
తినే విధానం:
కమలం కాడను నీటిలో ఉడకబెట్టి తినొచ్చు లేదా కొద్దిగా మసాలా వేసి కూరగా తయారు చేసుకొనిక కూడా తినొచ్చు. ఈ విధంగా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయి. రెగ్యులర్ డైట్‌లో దీన్ని చేర్చడం వల్ల మీ శరీరంలో వేగంగా మార్పులు కనిపిస్తాయి.