Loneliness: ఒంటరితనంతో గంటకు 100 మంది.. సర్వే రిపోర్ట్
Loneliness: ప్రపంచవ్యాప్తంగా గంటకు వందమంది ఒంటరితనంతో చనిపోతున్నట్లు తాజాగా ఒక సర్వే వెల్లడించింది.
Loneliness: ఒంటరితనంతో గంటకు 100 మంది.. సర్వే రిపోర్ట్
Loneliness: ఇటీవల కాలంలో ప్రాణాంతకమైన వ్యాధులతో పాటు ఒంటరితనం కూడా చేరిపోయింది. ఒంటరితనం ఇప్పుడు ప్రజల ప్రాణాలను తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గంటకు వందమంది ఒంటరితనంతో చనిపోతున్నట్లు తాజాగా ఒక సర్వే వెల్లడించింది. సర్వే వివరాలు చూద్దాం..
ఆధునిక యుగంలో జీవన శైలి ఎంతలా మారిపోయింది అంటే.. చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. సోలో లైఫ్ సో బెటర్ అనే కాన్సెప్ట్‌తో మరికొంతమంది సింగిల్ జీవితాన్నిగడుపుతున్నారు. కానీ ఈ ఒంటరితనమే ఇప్పుడు వారి ప్రాణాలను తీస్తుంది. తాజాగా వచ్చిన సర్వేల రిపోర్టుల ప్రకారం... ప్రపంచంలో ప్రతి గంటకు 100మంది ఒంటరితనం కారణంగా చనిపోతున్నారని తేలింది.
ఇటీవల WHO.. ఫ్రమ్ లోన్లీనెస్ టు సోషల్ కనెక్షన్‌పై జరిపిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సింగిల్‌గా సింగిల్‌గా ఉంటామని చెప్పే వాళ్లు చివరకు ఒంటరితనం అనే జబ్బుతో బాధపడి చనిపోతున్నారని ఈ నివేదికలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా గంటకు 100 మంది ఇలా ఒంటరితనంతో బాధపడుతూ చనిపోయారని వెల్లడించింది. ప్రాణాంతకమైన జబ్బులకంటే మరింత ప్రమాదకరంగా ఇప్పుడు ఈ ఒంటరితనం మారిందని రిపోర్టులు చెబుతున్నాయి.
ఒంటరితనం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
ఒంటరితనం అనేది మనిషి తినేసే ఒక పెద్ద సమస్య. ఈ సమస్యతో ఇటు మానసికంగా అటు శారీరకంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే గుండె జబ్బులు, డయాబెటీస్, సడన్ స్ట్రోక్స్, సడన్ డెత్స్ వంటివి సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్స్ తో చనిపోతున్నవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. దీనికి కారణం ఒంటరితనమేనని డబ్లుహెచ్‌వో చెబుతుంది.
మానసికమైన సమస్య
ఒక సర్వే ప్రకారం కరోనా తర్వాత చాలామందిలో మానసిక సమస్యలు పెరిగాయని చెబుతుంది. కరోనా సమయంలో కుటుంబ విలువలు తెలిసాయి. కానీ అప్పటికే ఒంటరితనంతో ఉన్నవారు భయానకమైన జీవితాన్ని చూడాల్సి వచ్చింది. అందరు కుటుంబాలు కలిసి ఇంట్లో ఉంటే సింగిల్‌గా ఉన్న వాళ్లు సింగిల్‌గానే ఉండిపోయారు. దీంతో వీరిలో ఎక్కువమంది ఒంటరితనంతో బాధపడ్డారు. ఇలా బాధపడుతున్నవారిలోఎక్కువగా సడన్ డెత్స్, సడన్ స్ట్రోక్ సంభవిస్తున్నాయని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
రిపోర్ట్ ఏం చెబుతుంది?
నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 22 శాతం మంది ప్రజలు ఒంటరితనంతో 16–24 ఏళ్ల వయసు గల యువతలో 40 శాతం మంది ఒంటరితనంతో సతమతమవుతున్నారు. అలాగే 65–74 వయసు గల వృద్దులలో 29 శాతం కంటే ఎక్కువమంది లోన్లీనెస్‌తో ఫీల్ అవుతున్నారు. దీనివల్ల మానసిక సమస్యలు ఎక్కువయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.
భారత్‌లోనూ పెరుగుతున్న ఒంటరితనం
మొన్నటివరకు మన దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఉద్యోగాలు, చదువులు, పెళ్లిళ్ల పేరిట కుటుంబాలను వదిలి దూరం ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలా కొంతమంది ఒంటరితనాన్ని చూస్తున్నారు. ఇక మహా నగరాల విషయానికొస్తే ఈ జీవనిశైలితో బిజీగా ఉండేవాళ్లు ఒంటరితనంతో ఎక్కువగా ఫీల్ అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఒంటరితనం పోగోట్టాలంటే..
మనిషి ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అంటే ఆ విషయం ఆ మనిషికే తెలుస్తుంది. అదేవిధంగా తనకు చాలా క్లోజ్‌గా ఉన్నవాళ్లకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఒంటరితనం అనేది మైండ్‌లోకి వచ్చిందో అప్పుడు వాళ్లని ఆ ఒంటరితనం నుంచి దూరంగా రప్పించాలి. ఒకవేళ మీకు మీరే ఒంటరితనంగా ఉన్నానని అనుకోండి. వెంటనే ఆ మైండ్ నుంచి బయటకు రావాలి. ఇష్టమైన పనులు చేయడం, ఫ్రెండ్స్‌తో కలవడం, చిన్నపిల్లలను ఫ్రెండ్ షిప్ చేసుకోవడం, పెట్స్‌ను కేర్ చేయడం.. కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడుతూ ఉండటం , బాధ్యతలను మరిచిపోకుండా అన్నీ నిర్వహిస్తే ఒంటరితనం అనేది దరి చేరదు.