Juice For Heart: ఈ జూస్ తాగితే గుండె జబ్బులు తగ్గుతాయని డాక్టర్లే చెబుతున్నారు
Juice For Heart: చిన్న వయసులో హార్ట్ ఎటాక్స్ రావడం సహజం అయిపోయింది. ఒకప్పుడు 60ఏళ్లలో హార్ట్ ఎటాక్స్ కనిపిస్తే ఇప్పుడు ముప్పైలో అవి కామన్ అయిపోయాయి. అయితే ముందు నుంచి గుండెను పదిలం చేసుకోవాలంటే మూడు రకాల జ్యూస్‌లను వారానికి ఒక సారైనా తాగాలని డాక్టర్లు చెబుతున్నారు.
Juice For Heart: ఈ జూస్ తాగితే గుండె జబ్బులు తగ్గుతాయని డాక్టర్లే చెబుతున్నారు
Juice For Heart: చిన్న వయసులో హార్ట్ ఎటాక్స్ రావడం సహజం అయిపోయింది. ఒకప్పుడు 60ఏళ్లలో హార్ట్ ఎటాక్స్ కనిపిస్తే ఇప్పుడు ముప్పైలో అవి కామన్ అయిపోయాయి. అయితే ముందు నుంచి గుండెను పదిలం చేసుకోవాలంటే మూడు రకాల జ్యూస్‌లను వారానికి ఒక సారైనా తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొవ్వు పెరిగిపోయినా, బీపీ ఎక్కువైనా దాని ప్రభావం గుండె మీద పడుతుంది. గుండెకు వెళ్లే రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. దీనివల్ల సడన్‌గా ఎటాక్స్ వస్తాయి. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్స్‌తో మధ్య వయసు గలవారు చనిపోతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే గుండెను బలాన్ని ఇచ్చి.. ఉత్సాహంగా చేసే మూడు రకాల జ్యూస్‌లు ఇప్పుడు చూద్దాం..
గుమ్మడికాయ
గుమ్మడికాయ రసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, సి, పొటాషియం, ఫైబర్ అలాగే ఇతర పోషకాలు గుండెను పదిలంగా ఉంచుతాయి. ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్ బీటా క్రిప్టోక్సంతిన్, ఇవి కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల గుండె చుట్టూ కొవ్వు పేరుకునే ప్రమాదం ఉండదు. అందుకే వారానికి ఒక్కసారైనా గుమ్మడికాయ రసం తాగడం మంచిది.
కీరా
కీరాతో చేసిన జ్యూస్‌లో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎ, సి, కె విటమిన్లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. మెగ్నీషియం కండరాలు మరియు నాడీ వ్యవస్థ పని తీరుకు సహాయపడుతుంది. వీటివల్ల హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
బీట్ రూట్
ఇక మూడోది బీట్ రూట్ జ్యూస్. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలైన జ్యూస్. ఇందులో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బీట్ రూట్ రసంలో ఉండే నైట్రేట్లు రక్తనాళాలకు నెమ్మది చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. నైట్రేట్ల వల్ల రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. గుండెకు మరియు ఇతర అవయవాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను మరింత సమర్ధవంతంగా సరఫరా చేస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్స్ వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.