Jamun: బాబోయ్..ఈ పండ్లు తింటే ఇన్ని లాభాలా?
Jamun Season: సీజనల్ ఫ్రూట్స్ తినాలని డాక్టర్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయినా ఎవరూ సరిగా పట్టించుకోరు. చాలామంది సీజనల్ ఫ్రూట్స్ మానేసి వాటి స్థానంలో స్టోరేజ్ ఫ్రూట్ షేక్‌లు తాగుతుంటారు.
Jamun: బాబోయ్..ఈ పండ్లు తింటే ఇన్ని లాభాలా?
Jamun Season: సీజనల్ ఫ్రూట్స్ తినాలని డాక్టర్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయినా ఎవరూ సరిగా పట్టించుకోరు. చాలామంది సీజనల్ ఫ్రూట్స్ మానేసి వాటి స్థానంలో స్టోరేజ్ ఫ్రూట్ షేక్‌లు తాగుతుంటారు. కానీ ఇలా చేయకుండా ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తీసుకుంటే శరీరానికి చాలామంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవికాలం చివర రోజుల్లో అలాగే వర్షాకాలం మొదలవుతున్నప్పుడు వచ్చే నేరేడుపండ్లను కచ్చితంగా తినాలని అంటున్నారు.
నేరేడుపండు. దీన్ని ఇండియన్ బ్లాక్ బెర్రీ అని పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్‌లో జావా ఫ్లమ్ అని పిలుస్తారు. నేరేడు పండ్లు చెట్టు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ వాటిని ఎక్కువగా ఎవరూ ఇష్టపడరు. తినరు. కానీ ఈ పండులో ఉండే పోషకాలు తెలిస్తే కచ్చితంగా దాని వెనుక పరుగుపెడతారని డాక్టర్లు చెబుతున్నారు.
చర్మం షైనీగా మారుతుంది
చాలామంది చర్మాన్ని చూస్తే డ్రైగా, పెలుసులుగా కనిపిస్తుంది. ఏజ్ పెరుగుతున్న వారిలోనూ ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారు కచ్చితంగా నేరేడుపండుని తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ పండులో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల దెబ్బతిన్న చర్మకణాలు మెరుగవుతాయి. ముఖంపై ముడతలు రాకుండా కూడా ఈ పండు కాపాడుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
నేరేడుపండులో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైబర్ మిండుగా ఉంటుంది. ఎటువంటి ఆహారం తిన్నా శరీరంలో ఫైబర్ ఉంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలా ఈ జీర్ణక్రియ సాఫీగా చేయడంలో నేరెడుపండు చాలా బాగా ఉపయోగపడుతుంది.
గుండెవ్యాధులు దరిచేరవు
నేరేడు పండులో యాక్సీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ వంటి గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది.
నేరేడు పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జలుబు, జ్వరాలతో తరచూ బాధపడేవారు వీటిని తినడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎటువంటి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది.
బీపీ, షుగర్‌లు కంట్రోల్
సాధారణంగా బీపీషుగర్లు ఉన్నవాళ్లు పండ్లు తినడానికి ఇష్టపడరు. కానీ షుగర్ ఉన్నవాళ్లు కూడా ఈ పండుని చక్కగా తినొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించే గుణం నేరేడుపండులో ఉంటుంది. ఇందులో ఉండే జాంబోసిన్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్లు ఈ పండుని కచ్చితంగా తినాలి.
చెత్తను బయటకు పంపుతోంది
మనకు తెలియకుండా మన పొట్టలో చాలా చెత్త ఉంటుంది. ముఖ్యంగా వెంట్రుకలు పొట్టలోపలికి వెళ్లినపుడు అక్కడ నుంచి బయటకు రాలేక పొట్టలోనే ఉండిపోతుంటాయి. వీటివల్ల చాలా అంటువ్యాధులు, కొన్ని రకాల క్యానెర్లకు ఇది కారణం అవుతుంది. అయితే నేరేడు పండ్లు తినడం వల్ల పొట్టలో ఉండే వెంట్రుకలు చిన్న చిన్న ముక్కలుగా మారి, ఆ తర్వాత విసర్జన ద్వారా బయటకు వచ్చేస్తాయి.