Jackfruit: పనస తొనలు తిని.. గింజలను పడేస్తున్నారా?
Jackfruit: ఎండాకాలం చివర్లో వర్షాకాలం మొదట్లో వచ్చే పండు.. పనసపండు. పనస పండు చాలా తియ్యగా ఉంటుంది.
Jackfruit: పనస తొనలు తిని.. గింజలను పడేస్తున్నారా?
Jackfruit: ఎండాకాలం చివర్లో వర్షాకాలం మొదట్లో వచ్చే పండు.. పనసపండు. పనస పండు చాలా తియ్యగా ఉంటుంది. అందుకే అందరూ ఆస్వాదించుకుంటూ తింటుంటారు. ఈ తొనల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే చాలామంది ఈ సీజన్‌లో పనస తొనలు తినాలని అంటారు. అయితే పనస తొనల్లోనే కాదు పనస గింజల్లోనూ మంచి పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
పనసలో ఎన్ని పోషకాలున్నాయో.. పనస గింజలోనూ అన్నే పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఈ గింజలను తినడం వల్ల శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ అందుతుంది.
ఫైబర్ ఎక్కువ
పనస గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహద పడుతుంది.
అంతేకాదు ప్రేగు కదలికలను క్రమబద్దీకరిస్తుంది. మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికీ ఇది బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తుంది. పేగులను శుభ్రపరిచి, ఆహారం శులువగా జీర్ణం అవడానికీ ఇది తోడ్పడుతుంది.
రక్తహీనత తగ్గించడంలోనూ..
పనస గింజలను ఈ సీజన్‌లో తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అనీమియాతో బాధపడేవారు ఈ గింజలను తింటే మంచిది. అలసట, బలహీనంగా ఉండేవాళ్లు కూడా వీటిని తింటే ఉల్లాసంగా ఉంటారు.
అందంలోనూ తోడుగా..
చర్మం కాంతివంతంగా కావాలాన్నా.. జుట్టు ఒత్తుగా పెరగాలన్నా పనసగింజలు తినాలి. ఇందులో ఉండే జింక్, ఐరన్, ప్రొటీన్లు జుట్టు బలంగా చేస్తాయి. బలహీనంగా ఉన్న జుట్టును బలంగా మారుస్తాయి. చర్మం కాంతివంగా తయారవుతుంది. ఈ గింజలలో ఉండే పోషకాలు యవ్వనంగా ఉంచడంలోనూ దోహదపడతాయి.
ఎలా తినాలి?
పనస గింజలను పల్లీలు ఉడకబెట్టుకుని తిన్నట్లే తినొచ్చు. పనస గింజల్లో కాస్త ఉప్పు, నీళ్లు వేసి ఉడికిస్తే గింజలు ఎంతో రుచిగా ఉంటాయి. అంతేకాదు, పనస గింజలను ఆలూ, బఠాణీ వంటి మసాలా కూరల్లో వేసుకుని వండుకుని తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి.