Air Conditioner : ఏసీలో గ్యాస్ లేకపోవడమే కాదు.. చల్లబడకపోవడానికి కారణాలివే !
వేసవిలో చాలా మంది చల్లదనం కోసం ఏసీలను ఆశ్రయిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఏసీ సరిగా పనిచేస్తున్నా, గదిలో చల్లగా అనిపించదు. సాధారణంగా, దీనికి గ్యాస్ తక్కువ అవ్వడమే కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
Air Conditioner : ఏసీలో గ్యాస్ లేకపోవడమే కాదు.. చల్లబడకపోవడానికి కారణాలివే !
Air Conditioner : వేసవిలో చాలా మంది చల్లదనం కోసం ఏసీలను ఆశ్రయిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఏసీ సరిగా పనిచేస్తున్నా, గదిలో చల్లగా అనిపించదు. సాధారణంగా, దీనికి గ్యాస్ తక్కువ అవ్వడమే కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏసీ చల్లబడకపోవడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక ప్రధాన కారణం గది ఉష్ణోగ్రత, ఏసీ సెట్ చేసిన ఉష్ణోగ్రత ఒకేలా ఉండడం కూడా.
వర్షాకాలంలో ఈ సమస్య ఎందుకు పెరుగుతుంది?
వర్షాకాలంలో తరచుగా గదిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గదిలోని అసలు ఉష్ణోగ్రత, మీరు ఏసీలో సెట్ చేసిన ఉష్ణోగ్రత దాదాపు సమానంగా ఉన్నప్పుడు కంప్రెసర్ ఆగిపోతుంది. అప్పుడు ఏసీ కేవలం ఫ్యాన్‌లా గాలిని మాత్రమే విసురుతుంది.. కానీ చల్లబరచదు. దీంతో ఏసీ పనిచేయడం లేదని భావిస్తుంటాం. ఉదాహరణకు, గది ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండి, మీరు ఏసీని కూడా 25 డిగ్రీలకు సెట్ చేస్తే, ఏసీ కంప్రెసర్ ఆన్ అవ్వదు. ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువగా ఉంటేనే ఏసీ చల్లదనాన్ని ఇస్తుంది.
గ్యాస్ లోపం లేదా లీకేజ్ కారణమా?
అయితే, గ్యాస్ తక్కువ అవ్వడం లేదా లీకేజ్ అవ్వడం కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. కానీ ప్రతిసారి ఇదే కారణం కాదు. గ్యాస్ లీక్ అయినప్పుడు ఏసీ కూలింగ్ నెమ్మదిగా తగ్గుతుంది. అలాగే, ఇండోర్ యూనిట్‌పై మంచు పేరుకుపోవడం లేదా వింత శబ్దాలు రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో నిపుణుడి సహాయంతో గ్యాస్ నింపించుకోవడం అవసరం.
ఇతర కారణాలు
ఫిల్టర్ జామ్ అవ్వడం: డస్ట్ ఫిల్టర్ మురికిగా ఉంటే, ఏసీ నుండి వచ్చే గాలి వేగం తగ్గిపోతుంది. దీనివల్ల చల్లదనం తక్కువగా అనిపిస్తుంది.
థర్మోస్టాట్ పాడవడం: ఉష్ణోగ్రతను గుర్తించే సెన్సార్ (థర్మోస్టాట్) పాడైపోయినా కూడా ఏసీ సరిగా చల్లబడదు.
గది చాలా పెద్దదిగా ఉండటం: ఒకవేళ గది పరిమాణం ఏసీ టన్నుల కెపాసిటీ కంటే పెద్దదిగా ఉంటే, ఏసీ సమర్థవంతంగా చల్లదనాన్ని అందించలేదు.
సమస్యకు పరిష్కారం
వర్షాకాలంలో AC ఉష్ణోగ్రతను 22-24 డిగ్రీల మధ్య ఉంచాలి. తద్వారా కంప్రెసర్ పనిచేస్తుంది. ఏసీకి తరచు సర్వీస్ చేయించండి. ఫిల్టర్‌లను శుభ్రంగా ఉంచాలి. గదిని బాగా మూసి ఉంచాలి. తద్వారా చల్లని గాలి బయటకు వెళ్ళదు. కూలింగ్ నిరంతరం తగ్గుతున్నట్లయితే, ఒక టెక్నీషియన్‌తో చెక్ చేయించుకోవాలి.