Vitamin B12 : విటమిన్ B12 లోపానికి.. గోర్లు పదే పదే విరగడానికి సంబంధం ఉందా? నిపుణులు ఏమంటున్నారంటే ?

Vitamin B12 : కొందరికి గోర్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. వాటికి రకరకాలుగా అలంకరణలు చేసి రంగురంగుల నెయిల్ పాలిష్‌లు వేసుకుంటారు.

Update: 2025-10-21 09:30 GMT

Vitamin B12 : కొందరికి గోర్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. వాటికి రకరకాలుగా అలంకరణలు చేసి రంగురంగుల నెయిల్ పాలిష్‌లు వేసుకుంటారు. ఇది కేవలం అమ్మాయిలకే పరిమితం కాదు, కొంతమంది అబ్బాయిలు కూడా గోర్లు పెంచుకుంటారు. ఇది చేతులకు మరింత అందాన్నిస్తుందని చాలామంది నమ్మకం. కానీ కొందరికి కొద్దిగా గోరు పెరగగానే, అది వాటంతట అవే విరిగిపోతాయి. మీ గోర్లు కూడా ఇలా బలహీనంగా ఉంటే లేదా తరచుగా విరిగిపోతుంటే దానికి కారణం విటమిన్ల లోపం. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది, కాబట్టి గోర్లు బలహీనంగా మారడం కూడా శరీర అంతర్గత ఆరోగ్యం సూచన. మరి ఏ విటమిన్ లోపం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి? విటమిన్ B12 లోపం రాకుండా ఉండటానికి ఏం చేయాలి? అనే విషయాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

గోర్లు బలహీనంగా మారడానికి ప్రధానంగా విటమిన్ B12 లోపమే కారణం. ఈ ముఖ్యమైన విటమిన్, గోర్ల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ గోర్లు కూడా తరచుగా విరిగిపోతుంటే, మీరు కూడా మీ విటమిన్ B12 స్థాయిలను పరీక్షించుకోవడం చాలా మంచిది. గోర్లు పగిలిపోవడానికి, వాటి రంగులో మార్పులకు B12 లోపం ఒక ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ B12 లోపం గోర్లపై మాత్రమే కాకుండా మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. గోర్లు పసుపు రంగులోకి మారడం, బలహీనంగా మారి సులభంగా విరిగిపోవడం B12 లోపం సాధారణ లక్షణాలు. ఆరోగ్యకరమైన గోర్లు గులాబీ రంగులో, మృదువుగా, పటిష్టంగా ఉండాలి. వాటిలో ఏమైనా మార్పులు కనిపిస్తే, అది శరీరంలో పోషకాల లోపానికి సంకేతం కావచ్చు.

శరీరంలో విటమిన్ B12 లోపం ఏర్పడినప్పుడు గోర్ల సమస్యలతో పాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిరంతర అలసట, బలహీనత, శరీరంలో బద్ధకం, శ్వాస ఆడకపోవడం లేదా తరచుగా తలతిరగడం వంటివి B12 లోపం ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మీ శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే, మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని నివారించవచ్చు. విటమిన్ B12 సమృద్ధిగా లభించే ఆహారాలు: కోడి మాంసం, చేపలు, గుడ్లు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే, పాలు కూడా ఎక్కువగా తాగాలి, ఎందుకంటే ఇందులో కూడా మంచి మొత్తంలో విటమిన్ B12 ఉంటుంది. సాధ్యమైతే, పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. వీటన్నిటితో పాటు, వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు విటమిన్ B12 సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసే ముందు లేదా సప్లిమెంట్లు ప్రారంభించే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

Tags:    

Similar News