Health News: గ్యాస్‌ సమస్యతో కడుపు ఉబ్బరంగా ఉంటుందా.. ఇలా పరిష్కరించుకోండి..!

Health News: చెడు జీవనశైలి, ఈటింగ్ డిజార్డర్స్ కారణంగా కడుపులో గ్యాస్ పెరిగి ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది...

Update: 2022-04-07 07:22 GMT

Health News: గ్యాస్‌ సమస్యతో కడుపు ఉబ్బరంగా ఉంటుందా.. ఇలా పరిష్కరించుకోండి..!

Health News: చెడు జీవనశైలి, ఈటింగ్ డిజార్డర్స్ కారణంగా కడుపులో గ్యాస్ పెరిగి ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు అందరిలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనిని ఎదుర్కోవటానికి, ప్రజలు అనేక రకాల మందులను తీసుకుంటున్నారు. కొంతమంది కొన్ని ఆహారాలకి దూరంగా ఉంటున్నారు. అయినా వారికి ఈ సమస్య తగ్గడం లేదు. ఈ రోజు ఈ సమస్యలకి గల కారణాలు, పరిష్కారాల గురించి తెలుసుకుందాం.

మీరు ఏదైనా ఆహారం లేదా నీరు తీసుకున్నప్పుడు వాటితో పాటు కొంత గాలి కూడా శరీరంలోకి వెళుతుంది. మీరు తిన్న ఆహారాన్ని జీర్ణవ్యవస్థ జీర్ణం చేసినప్పుడు గ్యాస్ ఏర్పడుతుంది. ఈ గాలి మీ కడుపు చుట్టూ ఒత్తిడిని కలిగిస్తుంది. దీని కారణంగా గ్యాస్, తేన్పులు వస్తాయి. గ్యాస్ కడుపులో ఉండటం సహజమే. అయితే ఎక్కువ గ్యాస్ ఏర్పడటం ప్రారంభిస్తే అది ఆందోళన కలిగించే విషయం. ఇది పెద్దప్రేగు క్యాన్సర్‌కు దారి తీస్తుంది.

మీకు ఎసిడిటీ సమస్యలు ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీ తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అల్లం, పుదీనా నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫెన్నెల్, యాపిల్ సైడర్ వెనిగర్ ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ సమస్య రావొద్దంటే టీ, పాల ఉత్పత్తులు, శీతల పానీయాలు తాగడం మానుకోండి. ఉల్లి, బంగాళదుంపలు, బచ్చలికూర తినవద్దు, ఇవి కడుపులో ఎక్కువ గ్యాస్‌ను కలిగిస్తాయి. ఆహారం తినేటప్పుడు మాట్లాడటం మానుకోండి. తద్వారా గాలి శరీరంలోకి వెళ్లకుండా నిరోధించవచ్చు. జంక్ ఫుడ్, బలమైన మసాలాలతో చేసిన వస్తువులు అసిడిటీకి ప్రధాన కారణం. అందువల్ల వాటిని తినడం మానుకోవాలి.

Tags:    

Similar News