Health Tips: కడుపులో గ్యాస్ ఏర్పడటం క్యాన్సర్ లక్షణమా.. అప్రమత్తంగా లేకపోతే చాలా నష్టం..!

Health Tips: కడుపులో గ్యాస్ ఏర్పడటం క్యాన్సర్ లక్షణమా.. అప్రమత్తంగా లేకపోతే చాలా నష్టం..!

Update: 2022-12-10 16:00 GMT

Health Tips: కడుపులో గ్యాస్ ఏర్పడటం క్యాన్సర్ లక్షణమా.. అప్రమత్తంగా లేకపోతే చాలా నష్టం..!

Health Tips: కడుపులో గ్యాస్ సమస్య ఉండటం సర్వసాధారణం. జీర్ణక్రియలో ఆటంకం ఏర్పడినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. గ్యాస్ కారణంగా కడుపులో నొప్పిగా ఉంటుంది. అయితే దీని వెనుక తీవ్రమైన కారణాలు ఉండవచ్చు. కడుపులో గ్యాస్ ఏర్పడటం వల్ల క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. స్లీప్ అప్నియా, హైపోథైరాయిడిజం, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కడుపు నొప్పికి కారణమవుతాయి.

పెద్దప్రేగు కాన్సర్

గ్యాస్ ఏర్పడినప్పుడు కడుపులో నొప్పి సమస్య ఉంటుంది. కడుపు క్యాన్సర్ విషయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. గ్యాస్, కడుపులో భారం, తిమ్మిరి, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. క్యాన్సర్ ఉంటే మలంలో రక్తస్రావం కావడం ఉంటుంది. ఈ లక్షణాలు చాలా ప్రాణాంతకం అని నిరూపించవచ్చు.

హైపోథైరాయిడిజం

హైపోథైరాయిడిజం కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఇది కడుపు, ప్రేగులని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు మొదలవుతాయి. ఈ లక్షణాలతో పాటు గొంతులో నొప్పి సమస్య ఉంటే అది థైరాయిడ్ అయ్యే అవకాశం ఉంటుంది.

స్లీప్ అప్నియా

స్లీప్ అప్నియా ఉన్నవారు ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. దీని కారణంగా గురక పెట్టేటప్పుడు గాలి మన శరీరంలోకి వెళుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ సమస్యలు ఏర్పడుతాయి. దీనిని విస్మరించడం చాలా ప్రాణాంతకం.

Tags:    

Similar News