ORS: ఒక్క ORS ప్యాకెట్‌తో అన్ని సమస్యలు మాయం.. ఎలా వాడాలో తెలుసా?
ORS : వేసవి కాలంలో అధిక చెమట, వడదెబ్బ కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.
ORS : ఒక్క ORS ప్యాకెట్‌తో అన్ని సమస్యలు మాయం.. ఎలా వాడాలో తెలుసా?
ORS: వేసవి కాలంలో అధిక చెమట, వడదెబ్బ కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో శరీరం నుంచి నీరు, ఉప్పు, మినరల్స్ ఎక్కువగా కోల్పోతాం. ఇలాంటి సందర్భంలో ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) అనేది చాలా అవసరం. కానీ, కేవలం ORS మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమా? మందులు కూడా వాడాల్సి ఉంటుందా? అనేది చాలామందికి ఉన్న సందేహం.
ORS ఎందుకు పనిచేస్తుంది?
ORS అనేది ఉప్పు, షుగర్, ఎలక్ట్రోలైట్ల మిశ్రమం. ఇది శరీరానికి శక్తిని తిరిగి అందిస్తుంది. వాంతులు, విరేచనాల వల్ల కోల్పోయిన నీరు, ఉప్పు, మినరల్స్‌ను ఇది తిరిగి నింపుతుంది. దీంతో శరీరంలో నీటి లోపం తగ్గి, బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు తగ్గుతాయి.
ORSతో పాటు మందులు ఎప్పుడు అవసరం?
సాధారణ విరేచనాలు లేదా తేలికపాటి వాంతులు అయితే కేవలం ORS మాత్రమే సరిపోతుంది. చాలామంది ఎలాంటి మందులు వాడకుండానే కోలుకుంటారు. కానీ, విరేచనాలు ఆగకుండా అవుతున్నా, కడుపు నొప్పి తీవ్రంగా ఉన్నా, లేదా విరేచనాల్లో రక్తం పడితే మాత్రం కేవలం ORS సరిపోదు. ఇలాంటి సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించి, ఆయన సూచించిన మందులను వాడాలి.
ORSతో పాటు వాడే మందులు:
యాంటీబయాటిక్స్: ప్రతిసారి విరేచనాలకు యాంటీబయాటిక్స్ ఇవ్వరు. ఇన్‌ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల అయితేనే డాక్టర్లు యాంటీబయాటిక్స్ సూచిస్తారు.
ప్రోబయాటిక్స్: ఈ మందులు జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. పేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. డాక్టర్లు తరచుగా ORSతో పాటు వీటిని కూడా సూచిస్తారు.
ఇతర మందులు: వాంతులను ఆపే మందులు లేదా జ్వరం తగ్గించే మందులను కూడా డాక్టర్లు సూచించినప్పుడు మాత్రమే వాడాలి.
ORS మాత్రమే ఎప్పుడు వాడాలి?
విరేచనాలు, వాంతులు తీవ్రంగా లేనప్పుడు, అలాగే శరీరంలో నీటి లోపం తక్కువగా ఉన్నప్పుడు కేవలం ORS మాత్రమే తీసుకోవడం సురక్షితం. ఇలాంటి సమయంలో తేలికపాటి ఆహారం, ఉదాహరణకు ఖిచిడీ, సూప్, అరటిపండు వంటివి తినవచ్చు. ఈ పరిస్థితిలో ORS త్వరగా ప్రభావం చూపిస్తుంది.
ORS ఎలా వాడాలి?
* ORS ప్యాకెట్‌పై ఉన్న సూచనలను పాటించాలి.
* ORS ద్రావణం తయారు చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
* ఒకేసారి కాకుండా, కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి.
* ద్రావణంలో అదనంగా పంచదార కలపకూడదు.
* ఎప్పుడూ కాచి చల్లార్చిన నీటిలోనే ORS ప్యాకెట్‌ను కలపాలి.
* ORS ద్రావణంలో నీరు మాత్రమే కలపాలి, జ్యూస్‌లు లేదా శీతల పానీయాలు కలపకూడదు.
* తయారు చేసిన ద్రావణాన్ని 24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ చేయకూడదు.