WiFi : రాత్రిపూట వైఫై ఆఫ్ చేయకుండా అలానే ఉంచితే ప్రమాదమా?
చాలామంది రాత్రిపూట వైఫై రౌటర్లను ఆఫ్ చేయకుండా వదిలేస్తారు. అయితే, నిద్రలో అలసట, ఇబ్బందులు వంటి సమస్యలు ఉంటే, దానికి మీ పక్కనే ఉన్న వైఫై రౌటర్ కూడా ఒక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు
WiFi : రాత్రిపూట వైఫై ఆఫ్ చేయకుండా అలానే ఉంచితే ప్రమాదమా?
చాలామంది రాత్రిపూట వైఫై రౌటర్లను ఆఫ్ చేయకుండా వదిలేస్తారు. అయితే, నిద్రలో అలసట, ఇబ్బందులు వంటి సమస్యలు ఉంటే, దానికి మీ పక్కనే ఉన్న వైఫై రౌటర్ కూడా ఒక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట వైఫై రౌటర్‌ను ఆఫ్ చేయకపోతే కలిగే లాభనష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వైఫై ప్రభావం: లాభాలు-నష్టాలు
నష్టాలు:
నిద్రపై ప్రభావం: 24 గంటలూ రౌటర్ ఆన్‌లో ఉంటే, దాని సిగ్నల్స్ నిద్రను ప్రభావితం చేస్తాయి. ఆస్ట్రేలియాలోని RMIT విశ్వవిద్యాలయం ఒక నివేదిక ప్రకారం, వైఫై సిగ్నల్స్‌కు దగ్గరగా నిద్రించే వారిలో 27 శాతం మందికి నిద్రలేమి సమస్యలు ఉన్నట్లు తేలింది.
గాఢ నిద్రకు ఆటంకం: 2021లో ఎలుకలపై చేసిన ఒక పరిశోధనలో, 2.4GHz వైఫై సిగ్నల్స్ గాఢ నిద్రను తగ్గించాయని తేలింది.
లాభాలు:
మెదడుకు విశ్రాంతి: రాత్రిపూట వైఫైని ఆఫ్ చేయడం వల్ల మెదడుకు విశ్రాంతి లభించి, నిద్ర బాగా పడుతుంది.
ఆర్థిక ప్రయోజనాలు: విద్యుత్, ఇంటర్నెట్ డేటా రెండూ ఆదా అవుతాయి.
రౌటర్ జీవిత కాలం పెరుగుతుంది.
ఆరోగ్య సంస్థల అభిప్రాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు ICNIRP వంటి సంస్థలు వైఫై రేడియేషన్ తక్కువ స్థాయిలో ఉంటుందని, అది ఆరోగ్యానికి పెద్దగా హానికరం కాదని చెబుతున్నాయి. అయితే, ఇది నేరుగా ప్రమాదం కాకపోయినా, నిద్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని చాలా నివేదికలు సూచిస్తున్నాయి.
పరిష్కారాలు
మీరు రాత్రిపూట వైఫై ఆఫ్ చేయడం వల్ల CCTV కెమెరాలు లేదా ఇతర స్మార్ట్ పరికరాలు పనిచేయవని భావిస్తే, రౌటర్‌ను మీ బెడ్‌రూమ్‌కు దూరంగా పెట్టడం మంచి పరిష్కారం. ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. వీలైనంత వరకు రాత్రిపూట వైఫైని ఆఫ్ చేయడం మంచి అలవాటు.