Hair Thinning Problem: రోజురోజుకు జుట్టు పలుచబడుతుందా.. కారణాలు తెలుసుకొని నివారణ మార్గాలు ఎంచుకోండి..!

Hair Thinning Problem: జుట్టు మందంగా ఉంటే అందంగా కనిపిస్తారు లేదంటే అంద విహీనంగా కనిపిస్తారు.

Update: 2024-02-21 16:00 GMT

Hair Thinning Problem: రోజురోజుకు జుట్టు పలుచబడుతుందా.. కారణాలు తెలుసుకొని నివారణ మార్గాలు ఎంచుకోండి..!

Hair Thinning Problem: జుట్టు మందంగా ఉంటే అందంగా కనిపిస్తారు లేదంటే అంద విహీనంగా కనిపిస్తారు. అందుకే పొడవాటి జుట్టు అంటే అందరికి ఇష్టం. కానీ నేటి రోజుల్లో చాలామంది జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. చిన్నవయసులోనే బట్టతల వచ్చేసి బయటికి రాలేకపోతున్నారు. ఇంకొందరికి ఈ సమస్య వల్ల పెళ్లిళ్లు కూడా అవ్వడం లేదు. అయితే జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

జన్యుపరమైన లోపాలు

కొంతమంది వ్యక్తులు సన్నని జుట్టును వారసత్వంగా పొందుతారు. వీరి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జుట్టు నాణ్యత సరిగ్గా లేకుంటే వారి జుట్టు కూడా పలుచగా మారే అవకాశం ఉంది.

ముసలితనం వల్ల

వయసు పెరిగే కొద్దీ జుట్టు సహజంగా పలుచబడుతుంది. ఈ పరిస్థితిలో పోషకాహారం తీసుకోవడం ఒక్కటే మార్గం.

పోషకాహార లోపాలు

శరీరం, జుట్టు సరైన పెరుగుదలకు పోషకాహారం చాలా ముఖ్యం. పోషకాహారం లోపం వల్ల జుట్టుపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆహారంలో బయోటిన్, ఐరన్, విటమిన్ డి, ప్రొటీన్ వంటి పోషకాలు ఉండాలి. లేదంటే వెంట్రుకలు పల్చబడటం, కొసలు చిట్లడం మొదలవుతుంది.

అధిక ఒత్తిడి

అధిక ఒత్తిడి నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండటం వల్ల జుట్టు ఊడిపోతుంది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒత్తిడి జుట్టు పెరుగుదల చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది జుట్టు రాలడానికి పలుచబడటానికి దారితీస్తుంది.

వైద్య పరిస్థితి

జుట్టు రాలే సమస్య కొన్ని రకాల వైద్య పరిస్థితుల కారణంగా కూడా జరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల వల్ల ఇది జరుగుతుంది.

జుట్టు సంరక్షణ ఎలా?

ఆరోగ్యకరమైన ఆహారం

సమతుల్య ఆహారం తీసుకోవడం జుట్టు పెరుగుదల, నాణ్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పోషకాహారం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో గుడ్లు, నట్స్ వంటి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఇది కాకుండా ఆకుకూరలు, చేపలు వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్, బీన్స్ వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్ జుట్టుకు మేలు చేస్తాయి.

Tags:    

Similar News