Women's Day 2025: మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..థీమ్, చరిత్ర ప్రాముఖ్యత ఇదే
Women's Day 2025: మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏటా మార్చి 8వ తేదీనే జరుపుకుంటారు. మహిళలు దేనిలోనూ తక్కువ కాదంటూ లింగ సమానత్వాన్ని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. మానవజాతి మనుగడకు ప్రాణం పోసే మహిళ, ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగం అంటూ సామాజిక, ఆర్థిక, సాంస్క్రుతిక, రాజకీయ విజయాలు సాధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నింటిలోనూ గుర్తింపు పొందారు. అయితే మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభం అయ్యింది. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్య ఏమిటో తెలుసుకుందాం.
మహిళలు స్వతంత్రంగా, ప్రతి రంగంలో సాధికారత పొందే వరకు సమాజం అభివృద్ధి చెందదు. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మహిళల హక్కులు, సమానత్వం, వారి సహకారాన్ని గౌరవించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం, ఉద్దేశ్యం సమాజంలో మహిళల పాత్రను గుర్తించడం. వారు ముందుకు సాగడానికి ప్రేరేపించడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. మహిళా దినోత్సవం కేవలం ఒక రోజు వేడుక కాదు, మహిళా సాధికారత, సమానత్వం వైపు ఒక అడుగు. మహిళా దినోత్సవ వేడుకలు ఎప్పుడు, ఎందుకు ప్రారంభమయ్యాయో..అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళా దినోత్సవ చరిత్ర:
మహిళా దినోత్సవ వేడుకలు 20వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. 1908లో, అమెరికాలోని శ్రామిక మహిళలు తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు, ఓటు హక్కును కోరుతూ న్యూయార్క్‌లో ప్రదర్శన ఇచ్చారు.ఒక సంవత్సరం తరువాత, 1909లో, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఫిబ్రవరి 28న మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. తరువాత, క్లారా జెట్కిన్ అనే సోషలిస్ట్ నాయకురాలు మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదట 1911లో జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లలో జరుపుకున్నారు. ఐక్యరాజ్యసమితి (UN) 1975 లో మార్చి 8 ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది.
మహిళా దినోత్సవ ప్రాముఖ్యత:
మహిళా సాధికారతను ప్రోత్సహించడం
లింగ సమానత్వం కోసం కృషి చేయడం
మహిళల హక్కులను కాపాడటం
మహిళల సామాజిక, రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం
పని ప్రదేశాలలో మహిళల విద్య, ఆరోగ్యం, వారి హక్కులను బలోపేతం చేయడం.
మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు?
ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా, వివిధ రంగాలలో అద్భుతమైన కృషి చేసిన మహిళలను సత్కరిస్తారు. అదే సమయంలో, మహిళల హక్కులు, అవగాహన కోసం ర్యాలీలు, సెమినార్లు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహిళల ఆరోగ్యం, విద్య, వృత్తికి సంబంధించిన అంశాలను చర్చిస్తారు.
2025 మహిళా దినోత్సవం థీమ్
ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి మహిళా దినోత్సవానికి ఒక థీమ్‌ను నిర్దేశిస్తుంది. 2024 సంవత్సరానికి ఇతివృత్తం "ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్", ఇది ప్రతి రంగంలో మహిళలకు సమాన అవకాశం, భాగస్వామ్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం 2025 మహిళా దినోత్సవం థీమ్ "చర్యను వేగవంతం చేయండి". ఈ థీమ్ అన్ని మహిళలు, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారతపై ఆధారపడి ఉంటుంది.