Sugarcane Juice: చెరుకు రసంతో అందాన్ని పెంచుకోండి.. యవ్వనంగా మారిపోండి..!

Sugarcane Juice: ఈ సీజన్‌లో చెరుకురసం అధికంగా లభిస్తుంది. చెరుకు కోతకు రావడంతో మార్కెట్‌లో తక్కువ ధరకే చెరుకుగడలు లభిస్తాయి.

Update: 2024-03-02 16:00 GMT

Sugarcane Juice: చెరుకు రసంతో అందాన్ని పెంచుకోండి.. యవ్వనంగా మారిపోండి..!

Sugarcane Juice: ఈ సీజన్‌లో చెరుకురసం అధికంగా లభిస్తుంది. చెరుకు కోతకు రావడంతో మార్కెట్‌లో తక్కువ ధరకే చెరుకుగడలు లభిస్తాయి. ఎండాకాలం చెరుకు రసం తాగడం వల్ల హెల్త్‌కు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాస్తంత అల్లం, నిమ్మరసం తగిలించిన తాజా చెరకు రసం తాగితే అలసట, నీరసం మాయమై శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఇది ఆరోగ్యానికే కాదు.. అందానికి, కేశ సౌందర్యానికి మేలు చేస్తుంది. ఈ రోజు చెరుకురసం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

చెరకురసంలో ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి అప్లై చేస్తే చర్మంపై ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయి. ఇందులో ఉండే సమ్మేళనాలు చర్మకణాలను పునరుత్తేజితం చేస్తాయి. చెరకు రసంలో తేనె కలిపి పావుగంట పాటు చర్మానికి మర్దన చేయాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం మెరుస్తుంది. నిమ్మరసం, యాపిల్ జ్యూస్, ద్రాక్ష రసం, కొబ్బరి పాలు, చెరకు రసం.. వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి మెరుపు వస్తుంది.

చర్మాన్ని యవ్వనంగా, బిగుతుగా ఉంచడానికి మామూలు ఐస్‌క్యూబ్‌ల కన్నా చెరకు రసంతో తయారు చేసుకున్న ఐస్ క్యూబ్‌లను వాడితే రెట్టింపు ఫలితాలుంటాయి. బొప్పాయి గుజ్జులో చెరకు రసాన్ని కలిపి పట్టించడం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. నాలుగు చెంచాల చెరకు రసానికి రెండు చెంచాల నెయ్యి చేర్చి, చర్మానికి మర్దన చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.

లీటరు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు, పావు లీటరు చెరకు రసం కలిపి, మరిగించి ఆవిరి పట్టుకుంటే చర్మం తేటగా తయారవుతుంది. ఎటువంటి పదార్థాలూ కలపకుండా ప్యూర్‌ చెరకు రసాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది.

Tags:    

Similar News