Health: వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..!

Health: భారతదేశంలో వేసవికాలం మొదలైంది. చాలా ప్రాంతాల్లో వేడి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2022-04-20 09:47 GMT

Health: వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..!

Health: భారతదేశంలో వేసవికాలం మొదలైంది. చాలా ప్రాంతాల్లో వేడి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయితే చాలా సార్లు ప్రజలు నిత్యావసర పనుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో చాలా మంది ప్రజలు వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురవుతారు. అందుకే ఆరోగ్యాన్ని మెరుగ్గా చూసుకోవడానికి రోజువారీ ఆహారంలో చల్లని ఆహారాలని చేర్చుకోవాలి. కాబట్టి వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగల ఆహారాల గురించి తెలుసుకుందాం.

వేసవి కాలంలో పెరుగు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఇది జీర్ణక్రియకి చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు పెరుగును లస్సీ రూపంలో కూడా తీసుకోవచ్చు. వేసవి కాలంలో పుదీనా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది పొట్టను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు, చర్మం, పొట్ట, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

వేసవిలో ఆరోగ్య నిపుణులు తరచుగా దోసకాయ తినమని చెబుతారు. దోసకాయలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇది వేసవిలో మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టుకు చాలా ఉపయోగపడుతాయి. వేసవి కాలంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తప్పనిసరిగా నిమ్మరసం తీసుకోవాలి. ఇది శరీరం అలసటను పోగొట్టి మిమ్మల్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు వీలైనంత త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటే తేనెతో కలిపి గోరువెచ్చని నిమ్మకాయ నీటిని తాగవచ్చు. దీంతో మీ చర్మం మెరుస్తుంది. దీంతో పాటు శరీరంలోని జీవక్రియలు కూడా మెరుగ్గా ఉంటాయి.

Tags:    

Similar News