Weight Loss Tips: బరువు తగ్గాలంటే వీటిని అదుపులో ఉంచుకోవాల్సిందే..!

Weight Loss Tips: బరువు తగ్గాలంటే వీటిని అదుపులో ఉంచుకోవాల్సిందే..!

Update: 2022-07-15 02:30 GMT

Weight Loss Tips: బరువు తగ్గాలంటే వీటిని అదుపులో ఉంచుకోవాల్సిందే..!

Weight Loss Tips: పెరిగిన బరువు, కొవ్వుని ఎవరూ ఇష్టపడరు. ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించాలనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ ఇది కొంచెం కష్టమైనది. ఎందుకంటే దీనికోసం కొంత శ్రమించాల్సి ఉంటుంది. అయితే అధిక బరువు తగ్గించుకోవడానికి మరోక విధానం కూడా ఉంది. అదేంటంటే ఆహారంపై నిఘా ఉంచడం. కొవ్వును పెంచే ఆహారాలకి దూరంగా ఉండటం. వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 8 గంటలు నిద్రపోవాలి. ఎందుకంటే దీని కంటే తక్కువ నిద్రపోవడం వల్ల మీ శరీరంలో కొలస్ట్రాల్‌ అధికమవుతుంది. తీపి కోరికలను అణచివేయడానికి స్వీట్లు లేదా చక్కెరకు బదులుగా పండ్లు తినండి. ఇలా చేయడం వల్ల సహజ చక్కెర శరీరంలో కి చేరుతుంది. అంతేకాదు కోరికలు కూడా తగ్గుతాయి. కొవ్వు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అతిగా తినే అలవాటు చాలా ప్రమాదం. ఫాస్ట్ ఫుడ్, మైదా, స్వీట్లతో చేసిన ఆహారాలు చూసి కూడా తినకుండా ఉండే విధంగా అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.

ప్లేట్‌లో ఉన్న ఆహారం తినేముందు దానివల్ల మీ శరీరానికి ఎంత పోషకాహారం లభిస్తుంది. ఎంత కొవ్వు, ఎన్ని కేలరీలు లభిస్తాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఈ ప్రశ్న అడగడం ప్రారంభించిన వెంటనే మీ శరీరం కోరికలను అదుపుచేసుకుంటుంది. శరీరంలో ఇందుకు సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి. అప్పుడు మీరు అదనపు కొవ్వు, కేలరీలను తీసుకోకుండా ఉంటారు. అంతేకాదు బరువు కూడా అదుపులో ఉంటుంది.

Tags:    

Similar News