Health Tips: బరువు తగ్గాలంటే ఈ ఆహారాలని నివారించండి.. లేదంటే బిల్లు చెల్లించాల్సిందే..

Health Tips: బరువు తగ్గాలంటే ఈ ఆహారాలని నివారించండి.. లేదంటే బిల్లు చెల్లించాల్సిందే..

Update: 2023-01-29 06:14 GMT

Health Tips: బరువు తగ్గాలంటే ఈ ఆహారాలని నివారించండి.. లేదంటే బిల్లు చెల్లించాల్సిందే..

Health Tips: ఊబకాయం నేటి కాలంలో సర్వసాధారణం. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీనికి కారణాలు. పిండి పదార్థాలు, చక్కెర, కొవ్వుతో కూడిన ఫుడ్స్‌ అధికంగా తీసుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గాలంటే ముందుగా జీవనశైలిలో మార్పులు చేయడం అవసరం. తర్వాత ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అంతేకాకుండా కొన్ని ఆహారాలని నివారించాలి. వాటి గురించి తెలుసుకుందాం.

శీతల పానీయాలు

శీతల పానీయాలలో చక్కెర,,కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. కాబట్టి పెరిగిన బరువును నియంత్రించడానికి ఈ పానీయాలను తాగడం మానేయాలి. వీటికి బదులుగా జీలకర్ర నీరు, లవంగం నీరు లేదా తేనె, నిమ్మకాయ నీటిని తీసుకోవాలి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడుతాయి.

ఫ్రైస్, చిప్స్

ఫ్రైస్, చిప్స్ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కానీ వీటిని డీప్ ఫ్రై చేయడం ద్వారా తయారు చేస్తారు. ఇవి చాలా కేలరీలతో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా పెరుగుతుంది. దీంతో ఊబకాయానికి గురవుతారు. కాబట్టి బరువు తగ్గే సమయంలో వీటిని తినడం మానుకోండి.

పాస్తా

పాస్తాను మైదా పిండితో తయారు చేస్తారు. కాబట్టి ఇందులో అధిక మొత్తంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంతేకాదు ఫైబర్, ప్రోటీన్, అవసరమైన పోషకాలు ఇందులో ఉండవు. అందుకే వీటిని తినడం తగ్గించాలి.

కేకులు

మీరు స్వీట్లను తినడానికి ఇష్టపడితే చాలా బరువు పెరుగుతారు. కేకులలో ఎక్కువగా మైదా వాడుతారు. ఇది బరువు పెంచుతుంది. అందుకే వీటి విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. బరువు తగ్గాలంటే వీటి జోలికి పోకూడదని గుర్తుంచకోండి.

Tags:    

Similar News