Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే అది న్యూమోనియా.. చలికాలంలో చాలా ప్రమాదం..!

Health Tips: శీతాకాలం ప్రారంభమైంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతారు.

Update: 2022-11-22 14:25 GMT

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే అది న్యూమోనియా.. చలికాలంలో చాలా ప్రమాదం..!

Health Tips: శీతాకాలం ప్రారంభమైంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతారు. ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్న వ్యక్తులకి వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. న్యుమోనియా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఇందులో వ్యక్తి సరిగా శ్వాస తీసుకోలేడు. న్యుమోనియా అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స విధానం ఏంటో తెలుసుకుందాం.

ఊపిరితిత్తులపై బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు దాడి చేసినప్పుడు న్యుమోనియా సంభవిస్తుంది. కొన్నిసార్లు ఇతర వ్యాధులు లేదా మందులు కూడా ఈ వ్యాధికి కారణం అవుతాయి. న్యుమోనియాలో ఊపిరితిత్తులలో వాపు మొదలవుతుంది. దీని కారణంగా ఛాతీ నొప్పి వస్తుంది. న్యుమోనియా పెరిగినప్పుడు ఊపిరితిత్తులలో కఫం స్తంభింపజేస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

న్యుమోనియా లక్షణాలు

న్యుమోనియా మొదటి లక్షణం శ్లేష్మంతో కూడిన దగ్గు. న్యుమోనియా విషయంలో జ్వరం, తలనొప్పి, వణుకు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది కాకుండా న్యుమోనియాతో బాధపడుతున్న వ్యక్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, వాంతులు, వికారం మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

న్యుమోనియాను నివారించడం ఎలా..

న్యుమోనియాను నివారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. బిడ్డకు 6 నెలల వయస్సు వచ్చే వరకు తల్లి పాలు మాత్రమే తాగిపించాలి. తల్లి పాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది కాకుండా న్యుమోనియాతో పోరాడటానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. కానీ మీరు అధిక దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుంటే విటమిన్ సి వాడకాన్ని నివారించాలి.

Tags:    

Similar News