Diabetes: మధుమేహం వచ్చిందంటే ఈ చిట్కాలు పాటించండి..!

Diabetes: మధుమేహం వచ్చిందంటే ఈ చిట్కాలు పాటించండి..!

Update: 2022-06-15 13:30 GMT

Diabetes: మధుమేహం వచ్చిందంటే ఈ చిట్కాలు పాటించండి..!

Diabetes: ఈ రోజుల్లో మధుమేహం సర్వసాధారణమైపోయింది. వాస్తవానికి ప్రతిరోజూ ఎంత ప్రోటీన్, మినరల్, కొవ్వు, కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చో తెలుసుకోవాలి. డయాబెటిస్ చికిత్స చేయలేని వ్యాధి. కానీ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. మధుమేహం వచ్చిన వాళ్లు కొన్ని చిట్కాలని పాటించాలి. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

టర్నిప్ ఆకులు

ప్రతిరోజూ టర్నిప్ లీఫ్ గ్రీన్స్ తినడం ద్వారా మనకు 8 నుంచి 10 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అల్లనేరేడు

మధుమేహం ఉన్నవారు అల్లనేరేడు పండ్లు తీసుకుటే చాలా మంచిది. అలాగే డయాబెటిక్ రోగులు భోజనానికి ముందు జామున్ వెనిగర్ తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

గుడ్మార్

గుడ్మార్ అనేది భారతదేశంలో కనిపించే ఒక మూలిక. దీనిని ప్రాచీన కాలం నుంచి వాడుతున్నారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిని సిల్వెస్ట్రే అని కూడా అంటారు. టైప్ 1 షుగర్ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మెంతులు, దాల్చిన చెక్క

మీరు ఉదయం డైట్‌ మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు ఉదయాన్నే టీ తాగితే వారానికి నాలుగు రోజులు వేర్వేరు వస్తువులను తినాలి. ఉదాహరణకు మీరు మెంతులు, దాల్చిన చెక్క టీని తాగవచ్చు.

తులసి ఆకులు

డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెరను తగ్గించడానికి తులసి ఆకులు తినాలి. ఇందులో చక్కెరను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉందని చాలా పరిశోధనలు నిరూపించాయి. తులసి ఆకులు దీర్ఘకాల హార్డ్ బ్లడ్ షుగర్ బాధితులకు దివ్యౌషధంగా చెప్పవచ్చు.

Tags:    

Similar News