Beauty Tips: ముల్తాని మట్టితో మృదువైన చర్మం.. ఇదొక్కటి కలిపి అప్లై చేస్తే అదిరిపోద్ది..!

Beauty Tips: ప్రాచీన కాలం నుంచి చర్మ సంరక్షణలో ముల్తాని మిట్టిని చేర్చారు.

Update: 2023-01-24 07:41 GMT

Beauty Tips: ముల్తాని మట్టితో మృదువైన చర్మం.. ఇదొక్కటి కలిపి అప్లై చేస్తే అదిరిపోద్ది..!

Beauty Tips: ప్రాచీన కాలం నుంచి చర్మ సంరక్షణలో ముల్తాని మిట్టిని చేర్చారు. ఇది మీ చర్మాన్ని మృదువుగా,మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. దీంతోపాటు డెడ్ స్కిన్‌ని సులభంగా తొలగిస్తుంది. దీని వల్ల మీ ముఖం మెరుస్తుంది. అందుకే ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. ముల్తానీ మిట్టితో కలబంద జెల్‌ను అప్లై చేస్తే అది మీ చర్మానికి గులాబీ రంగును అందిస్తుంది. ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ముల్తానీ మిట్టి, కలబంద జెల్, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. తర్వాత ఈ ఫేస్ మాస్క్‌ను అప్లై చేసేముందు ముఖాన్ని బాగా కడగాలి. తరువాత ముఖంపై అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముల్తానీ మిట్టి, అలోవెరా జెల్ ముఖం మీద మచ్చలను తొలగిస్తుంది. ముఖానికి కొత్త మెరుపుని తీసుకొస్తుంది.

ఇది మీ చర్మాన్ని బిగుతుగా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కళ్ల కింద నల్లటి వలయాలను తొలగిస్తుంది. దీంతో మీ బ్లాక్ నెక్ సమస్య తొలగిపోతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల ముఖంలోని మృత చర్మం తొలగిపోతుంది. ఇది మీకు మృదువైన, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతేకాదు ఈ ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి ఖర్చు కూడా తక్కువే.

Tags:    

Similar News