Diabetes: చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే డయాబెటీస్‌ వచ్చినట్లే..!

Diabetes: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు

Update: 2023-05-28 14:30 GMT

Diabetes: చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే డయాబెటీస్‌ వచ్చినట్లే..!

Diabetes: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. వృద్ధులే కాదు యువత కూడా ఈ ప్రమాదకరమైన వ్యాధికి గురవుతున్నారు. డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెరను నియంత్రించడం అతిపెద్ద సవాలు. అందుకే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. అయితే మధుమేహం సంకేతాలను చర్మం ద్వారా కూడా గుర్తించవచ్చని ఇటీవల కొన్ని పరిశోధనలలో తేలింది. చర్మంలో కనిపించే కొన్ని సారూప్య లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

చర్మం గరుకుతనం

చర్మం గరుకుగా మారుతుందంటే మధుమేహానికి గురవుతున్నట్లు చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో మెడ, మణికట్టు, చేతుల పైభాగంలో చర్మం గరుకుగా మారుతుంది.

చర్మంపై పొక్కులు

డయాబెటిక్ రోగులకు చర్మంపై పొక్కుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే చర్మంపై వచ్చే పొక్కుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

చర్మం నల్లబడటం

చర్మంపై డార్క్ ప్యాచ్‌లు కనిపిస్తే రక్తంలో చక్కెర ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాలలో ఇలాంటి డార్క్‌ ప్యాచ్‌లు చేయి కింద లేదా మెడపై కనిపిస్తాయి. ఇది ప్రీ-డయాబెటిస్‌కు సంకేతమని చెప్పవచ్చు.

చర్మ వ్యాధులు

మధుమేహ వ్యాధిగ్రస్తులు చర్మవ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ సమయంలో చర్మంలో వాపు, నొప్పి లేదా మంటగా అనిపించవచ్చు.

పొడి బారిన చర్మం

రక్తంలో చక్కెర పెరగడం వల్ల చర్మం పొడిబారే ప్రమాదం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు తరచుగా పొడి చర్మం సమస్యను ఎదుర్కొంటారు.

చర్మం రంగు కోల్పోవడం

కొన్ని అధ్యయనాల ప్రకారం మొటిమల వల్ల డయాబెటిక్ రోగులు రంగు కోల్పోతారు. సకాలంలో వీటిని గుర్తించి చికిత్స తీసుకుంటే పర్వాలేదు. లేదంటే ఇవి చర్మంపై మచ్చలుగా మిగులుతాయి.

Tags:    

Similar News