Honey Benefits: తేనెను ఇలా వాడి చూడండి.. మచ్చలు మటుమాయం..!

Honey Benefits: తేనెను ఇలా వాడి చూడండి.. మచ్చలు మటుమాయం..!

Update: 2022-08-31 02:28 GMT

Honey Benefits: తేనెను ఇలా వాడి చూడండి.. మచ్చలు మటుమాయం..!

Honey Benefits: తేనె రుచిని అందరు ఇష్టపడుతారు. ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ తీపి పదార్థాన్ని సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పొడి, నిర్జీవమైన ముఖం కారణంగా నలుగురిలో తిరగలేకపోతున్నారు. తేనె సహాయంతో ముఖంపై అద్భుతమైన మెరుపును తీసుకురావచ్చు. అయితే దానిని ఉపయోగించాల్సిన సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.

తేనెలో ఉండే పోషకాలు

తేనెలో పోషకాల కొరత ఉండదు. కాబట్టి దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తిన్న తర్వాత మీకు తక్షణ శక్తి లభిస్తుంది. మీరు అనేక వ్యాధుల నుంచి రక్షించబడతారు. ఇది చర్మానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

ముఖ సౌందర్యం కోసం

మీరు ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటే తేనెను అప్లై చేయండి. ఎందుకంటే ఇది క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. కాలిన మచ్చలున్నా తేనె మాయమవుతుంది. ముఖంపై అద్భుతమైన గ్లో రావాలంటే శెనగపిండి, మీగడను తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది మచ్చలను తొలగిస్తుంది. అలాగే నిమ్మరసంలో తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకోవచ్చు. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు రెండింటినీ కలిపి ముఖానికి రాసుకోవాలి.

Tags:    

Similar News