నోరూరించే బీట్‌రూట్ హల్వా తయారీ ఎలా?
ఆరోగ్యకరమైన దుంపకూరగాయల్లో బీట్‌రూట్ ఒకటి.. ఇందులో ఎన్నో రకాలైన పోషకాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి
ఆరోగ్యకరమైన దుంపకూరగాయల్లో బీట్‌రూట్ ఒకటి.. ఇందులో ఎన్నో రకాలైన పోషకాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూరగా తీసుకునేందుకు చాలా మంది ఇష్టపడరు.. ఇందులో ఉండే వగరు వల్ల చిన్నపిల్లలు తినడానికి ముందుకు రారు.. కానీ పోషకాల బీట్‌రూట్ పిల్లలు సైతం మెచ్చేలే ఓ వంటను తయారు చేసుకోవచ్చు.. బీట్ రూట్‌తో హల్వా చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. రక్త హీనతతో బాధ పడేవారు బీటర్ రూట్ ను ఈ విధంగా తరుచూ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం కనిపిస్తుంది. మరి యమ్మీ యమ్మీ బీట్ రూట్ హల్వా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..
కావాల్సిన పదార్ధాలు
♦ బీట్‌రూట్
♦ ఉప్మా రవ్వ
♦ నెయ్యి
♦ చెక్కెర
♦ జీడిపప్పు
♦ కిస్‌మిస్
♦ బాదం పప్పు
♦ యాలకుల పొడి
తయారీ విధానం:
ముందుగా బీట్‌రూట్ పైన తొక్కుని తీసి శుభ్రంగా కడగాలి. తరువాత దానిని సన్నగా తరుముకోవాలి...ఇప్పుడు ఈ తరుమును ఒక గిన్నెల పెట్టుకోవాలి.. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నెయ్యి పోసుకోవాలి.. నెయ్యి కాస్త కాగాక ఉప్మా రవ్వను అందులో వేసుకోవాలి.. బాగా కలుపుతూ ఉండాలి.. ఇలా వేయించిన ఉప్మా రవ్వను తీసుకుని పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు అదే కడాయిలో మళ్లీ నెయ్యి పోయాలి. ఇందులో బాదం, జీడిపప్పు ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కిస్‌మిస్‌ను కూడా వేసి వేయించాలి. వేగిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌లను పక్కన పెట్టుకోవాలి. మళ్లీ కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేయాలి.. నెయ్యి కాగాక బీట్‌రూట్ తురుమును అందులో వేసుకోవాలి...
మీడియం ఫ్లే మ్‌లోనే హల్వాను తయారు చేసుకోవాలి... బీట్‌రూట్ తురుమును బాగా కలుపుతూ ఉండాలి...ఇప్పుడు కాస్త నీటిని ఆడ్ చేసుకోవాలి.. కావాలనుకునే వారు పాలను వేసుకోవచ్చు..ఇప్పుడు బాగా కలపాలి..ఇందులో చెక్కర వేసుకోవాలి.. బాగా కలుపుతూ ఉండాలి.. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకోవాలి.. నీరంతా పోయేంత వరకు బీట్‌రూట్ తురుమును ఉడికించాలి.. ఇప్పుడు ఇందులోనే యాలకూలను పొడి చేసుకుని దానిని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ ముక్కలను వేసుకోవాలి.. వీటిని బాగా కలుపుకోవాలి.. అంతే వేడి వేడి బీట్‌రూట్ హల్వా రెడీ.. వేడిగా బీట్‌రూట్ ఉన్నప్పుడు కూల్ ఐస్‌క్రీమ్‌ను తీసుకుంటుంటే దాని టేస్టే వేరప్ప.. మరి బీట్‌రూట్‌ను అతిగా ఇష్టపడని వారు ఇలాంటి హల్వా చేసుకుని ఎంచక్కా లాగించేయండి.