Health Tips: రోజుకి ఎన్ని గుడ్లు తినాలి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Health Tips: రోజుకి ఎన్ని గుడ్లు తినాలి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Update: 2023-01-14 16:00 GMT

Health Tips: రోజుకి ఎన్ని గుడ్లు తినాలి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Health Tips: ఆదివారం అయినా సోమవారం అయినా రోజూ గుడ్లు తినండి అనే యాడ్‌ టీవిలో మీరు చూసే ఉంటారు. గుడ్డు ప్రొటీన్ల నిధి అందుకే చికెన్ తిననివాళ్లు కూడా గుడ్లు తినడానికి ఇష్టపడతారు. కానీ గుడ్ల విషయంలో ఒక డౌట్‌ ఉంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని నమ్ముతారు. ఈ కారణంగా కొంతమంది గుడ్డులో తెల్లటి భాగం మాత్రమే తింటారు. అంతేకాదు ఒక రోజులో ఎక్కువ గుడ్లు తినడానికి భయపడతారు.

కానీ మెక్‌మాస్టర్ యూనివర్సిటీ, హామిల్టన్ హెల్త్ సైన్స్ పరిశోధనా బృందం ప్రకారం మీరు రోజూ ఒక గుడ్డు తింటే అది మీకు హాని కలిగించదు. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని పెంచదు.

శరీరంలోని కొలెస్ట్రాల్‌లో ఎక్కువ భాగం కాలేయం ద్వారానే తయారవుతుంది. అందుకే చాలా మంది నిపుణులు అధిక సంతృప్త కొవ్వు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల కాలేయంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఏర్పడుతుందని నమ్ముతారు. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ మీరు రోజూ ఒక గుడ్డు తింటే అది ఎటువంటి ప్రమాదం కలిగించదు.

గుడ్డులో ప్రోటీన్

ఒక గుడ్డులో సాధారణంగా 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అందుకే రెండు కోడిగుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు అందవు. కానీ గుడ్లలో కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి ఎక్కువ గుడ్లు తినమని ఎవ్వరూ సలహా ఇవ్వరు. ఒక వ్యక్తి శరీరానికి ఒక రోజులో ఎంత ప్రోటీన్ అవసరమో వ్యక్తి బరువును బట్టి నిర్ణయిస్తారు. మీ శరీర బరువు ప్రకారం 1 కిలో బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం.

Tags:    

Similar News